English | Telugu

నేను ఇప్పటివరకు షేర్ చేయని స్టోరీ!

ప్రతీ ఒక్కరికి స్టూడెంట్ లైఫ్ చాలా కీలకం.. ఆ లైఫ్ లో వేసే ప్రతీ అడుగు ఎన్నో జీవిత పాఠాలని, గుణపాఠాలని నేర్పిస్తుంది. అలాంటి టైమ్ లో మనం కెరీర్‌ ని స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోకుంటే తర్వాత బాధపడాల్సి వస్తుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే దీపిక రంగరాజు తన లైఫ్ లో కోల్పోయిన కొన్ని విషయాలని తన యూట్యూబ్ ఛానెల్ లోని వ్లాగ్ లో షేర్ చేసుకుంది.

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి. ఈ సీరియల్ లో ప్రధాన పాత్రలో చేస్తున్న దీపిక రంగరాజుకి బయట ఫ్యాన్ బేస్ గట్టిగానే ఉంది. ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ అత్యధిక టీఆర్పీ తో నెంబర్ స్థానంలో కొనసాగుతుంది. ఈ సీరియల్ లోని కనకం-కృష్ణమూర్తిల కుటుంబం ఒక మధ్యతరగతి కుంటుంబం. ఇందులో స్వప్న, కనకం ఆశలు గాల్లో ఉండగా.. కావ్య, కృష్ణమూర్తి ల ఆలోచనలు బాగుండాలి.. నిజాయితీగా ఉండాలి.. ఎవరిని నొప్పించకూడదనే విధంగా ఉంటాయి. అయితే ఈ ఫ్యామిలోని కావ్య, అప్పు, స్వప్న అందరికీ సుపరిచితమే.. కావ్య అలియాస్ దీపిక రంగరాజు ఇప్పుడు ప్రతీ కుటుంబంలో ఒక అమ్మాయిలా మారిపోయింది. ప్రతిరోజూ దీపిక రంగరాజు తన ఇన్ స్టాగ్రామ్ లో 'బ్రహ్మముడి' సీరియల్ కి సంబంధించిన వివరాలను షేర్ చేస్తుంటుంది. దీపిక రంగరాజు ఒక యూట్యూబ్ ఛానెల్ ని మొదలుపెట్టింది. ఆ ఛానెల్ లో తన మొదటి వీడియో.. 'బ్రహ్మముడి' సీరియల్ లో నా జర్నీ అలా మొదలైంది అంటూ ఆ వీడియోకి టైటిల్ ని పెట్టేసి.. అందులో 'బ్రహ్మముడి' సీరియల్ కి సంబంధించిన నటీనటులను పరిచయం చేయగా దానికి అత్యధిక వీక్షకాధరణ లభించింది.

ఇప్పుడు తాజాగా మరో వ్లాగ్.. " నేను ఇప్పటివరకు షేర్ చెయ్యని స్టోరీ" అని తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసింది. అందులో తన కాలేజీ లైఫ్ లో కోల్పోయిన ‌కొన్ని అవకాశాలని వివరించింది. ఆ టైమ్ లో ఎంజాయ్ చేసి కెరీర్ ని పాడుచేసుకు‌న్నాను‌. అప్పుడే ఇంజనీరింగ్ లో కంప్యూటర్స్ తీసుకుంటే ఇప్పుడు ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ అయ్యే దానిని కానీ అప్పుడు నాకు ఎవ్వరు చెప్పేవారు లేరు ఇప్పుడు మీకు చెప్తున్నాను మీరు మీ లైఫ్ ని వేస్ట్ చేసుకోకండి అంటు ఈతరం స్టూడెంట్స్ కి ఓ మెసెజ్ ఇచ్చింది దీపిక రంగరాజు. ‌కాగా బ్రహ్మముడి సీరియల్ అభిమానులు ఈ మెసెజ్ ని పాజిటివ్ గా తీసుకుంటున్నారు. ఈ వ్లాగ్ ఇప్పుడు యూట్యూబ్ లో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.