English | Telugu

Brahmamudi:కళ్యాణ్ ని ట్రెండీగా రెడీ చేసిన అనామిక.. పాపం రాజ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -301 లో... రాజ్ తో ఉన్న అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయితో అంత క్లోజ్ గా ఎందుకు ఉన్నాడని గుర్తుకుచేసుకొని కావ్య బాధపడుతు ఉంటుంది. అప్పుడే రాజ్ వచ్చి.. ఏమైంది అలా వున్నావ్ అని అడుగుతాడు. కావ్య తన మనసులో ఉన్న బాధని రాజ్ కి చెప్పకుండా మాటలతో టార్చర్ చేస్తుంది. రాజ్ కి ఏం జరిగిందో అర్థం కాదు.

మరొకవైపు కళ్యాణ్ రెడీ అయి ఎలా ఉందని అనామికని అడుగుతాడు. నువ్వు ఏమైనా అంకుల్ వా? ఎందుకు ఇలా రెడీ అవుతావని అనామిక అంటుంది. ఇలా ఉంటే బాగుంటావని అప్పు చెప్తూ ఉండేదని కళ్యాణ్ అనగానే.. అనామిక కోపంగా నాకు నచ్చలేదని అంటుంది‌. కాసేపటికి నేను రెడీ చేస్తానని చెప్తుంది. మరొకవైపు రాజ్ కి కావ్య కాఫీ తీసుకొని వచ్చి రాజ్ తో అర్ధం కాకుండా మాట్లాడేసరికి.. అసలు ఏమైందో అని అనుకుంటాడు. మరొకవైపు కళ్యాణ్ ని అనామిక ట్రెండీ గా రెడీ చేస్తుంది. ఇలా బయటకు వెళ్తే అందరూ ఏమంటారో అని కళ్యాణ్ అంటాడు. ఇలా బాగున్నావని అనామిక చెప్తుంది. మరొక వైపు అప్పు పిజ్జా డెలివరీకి రెడీ అవుతుంటుంది. ఎక్కడికి వెళ్తున్నావని కృష్ణమూర్తి అప్పుని అడుగుతాడు. పిజ్జా డెలివరీకి వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. ఇంకా వెళ్లకుంటే ఇక ఎప్పటికి రాకని చెప్తారని అప్పు అంటుంది. అయిన ఇప్పుడు నువ్వు జాబ్ చెయ్యకుండా ఉంటే గడవలేని స్థితి లో ఏం లేమని కనకం అంటుంది. అయిన వినకుండా అప్పు వెళ్ళిపోతుంది. అది జరిగిన విషయం నుండి బయటకు రాలేదని కనకం అనగానే.. దానికి పెళ్లి చెయ్యాలి అప్పుడు ఆ విషయం మార్చపోతుందని అన్నపూర్ణ అంటుంది. అయిన దానికి పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదని కనకం అనగానే.. పెళ్లి చెయ్యడం మన బాధ్యత అని అన్నపూర్ణ చెప్తుంది.

మరొకవైపు అందరు కలిసి భోజనం చేస్తుంటే కావ్య వడ్డీస్తూ ఉంటుంది. అప్పుడే ట్రెండీ గా రెడీ అయిన కళ్యాణ్ ని తీసుకొని అనామిక వస్తుంటే అందరు ఆశ్చర్యంగా చూస్తారు. అందరి ముందుకు కళ్యాణ్ రావడానికి సిగ్గు పడుతుంటే.. అనామిక తీసుకొని వస్తుంది. అందరు కళ్యాణ్ ని బాగున్నావని అంటారు. ఆ తర్వాత రాజ్ పై కోపంతో అర్థం కాకుండా కావ్య ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. ఆ తర్వాత రాజ్ గదిలోకి వచ్చి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావని‌ కావ్యని అడుగుతాడు. ఎందుకో మీకు నిజం గా తెలియదా అని కావ్య అడుగుతుంది. తెలియదని రాజ్ అనగానే.. నాకు క్లారిటీ వచ్చాక అడుగుతాను. అది మిమల్ని మాత్రమే అడుగుతానని కావ్య చెప్తుంది. రాజ్ కీ కావ్య పై కోపం వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.