English | Telugu

రూమర్స్ కి సమాధానమిచ్చిన మల్లెమాల టీమ్

ఒకప్పుడు సక్సెస్ఫుల్ గా రన్ ఐన షో జబర్దస్త్. ఈ షోని ఫామిలీ మొత్తం కూర్చుని ఎంజాయ్ చేసేవారు. ఐతే ఈ షోకి వున్న ఆదరణ రోజురోజుకూ తగ్గుతూ వస్తోంది. దీనికి రేటింగ్స్ తగ్గడం మొదలయ్యేసరికి ఎక్స్ట్రా జబర్దస్త్ ని లాంచ్ చేశారు. ఈ రెండు షోస్ కి కలిపి అనసూయ, రష్మీ, రోజా, నాగబాబు యాంకర్స్ గా, జడ్జెస్ గా ఉన్నారు. ముందు నాగబాబు, తర్వాత రోజా, కమెడియన్స్ అంతా వన్ బై వన్ దూరమవుతూ వచ్చారు. దీని కారణంగా జబర్దస్త్ షో పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. బుల్లితెర స్టార్ గా పేరు పడిన సుధీర్ వెళ్లిపోయేసరికి కావాలనే పక్కకు తప్పించారనే రూమర్స్ బయటికి వచ్చాయి. తర్వాత అతని ఫ్రెండ్స్ కూడా బయటికి వచ్చేసారు. ఇప్పుడు జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ రెండిట్లో ఏదో ఒకటే ఉంటుందని వస్తున్న ప్రచారాలపై మల్లెమాల సంస్థ ఒక క్లారిటీ ఇచ్చింది. వెళ్లిన వాళ్ళు ఎలాగో వెళ్లిపోయారు. కొత్త వాళ్ళతో ఐనా షో నడిపిస్తాం కానీ ఈ షోని ఎట్టి పరిస్థితిలో ఆపేది లేదు అన్నారు . ప్రస్తుతం ఈ షోకి అనుకున్నంత టాక్, రేటింగ్స్ కానీ రావడం లేదు. ఐతే ఇంతకుముందులా జబర్దస్త్ మళ్ళీ పుంజుకోవాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.