English | Telugu
మాళవిక ప్లాన్ వేద తెలుసుకుంటుందా?
Updated : Dec 11, 2021
బుల్లితెర ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న సీరియల్ `ఎన్నెన్నో జన్మలబంధం`. స్టార్ మా లో ఇటీవలే మొదలైన ఈ ఫ్యామిలీడ్రామా మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఓ పాప కోసం తపించే ఓ యువతి కథ నేపథ్యంలో ఈ సీరియల్ ని దర్శకులు కొత్త కోణంలో ఆవిష్కరించిన తీరు అలరిస్తోంది. కీలకమైన వేద పాత్రలో కోల్‌కతా నటి డెబ్ జానీ మోడక్ నటిస్తుండగా మరో ప్రధాన పాత్ర అయిన యష్ గా నిరంజన్ నటిస్తున్నారు.
కొంపముంచిన అషూరెడ్డి చెత్త ఐడియా!
యష్ , వేదల గిల్లికజ్జాల నేపథ్యంలో సాగిపోతున్న ఈ సీరియల్ తాజాగా పాప కారణంగా సరికొత్త మలుపులు తిరుగుతోంది. పాపని..డాక్టర్ వేదని అడ్డు పెట్టుకుని యష్ ని దెబ్బతీయాలని యష్ మాజీ భార్య మాళవిక, ఆమె ప్రియుడు ప్లాన్ చేస్తారు. దీంతో వ్యవహారం కోర్టు దాకా వెళుతుంది. కోర్టులో మహిళా కమీషన్ యష్ కూతురు షుషీని తల్లి మాళవికే అప్పగించాలని రెండు వారాల్లో తుది తీర్పు ఇస్తామని ప్రకటిస్తుంది. దీంతో చేసేది లేక యష్ తన ఖుషీని మాళవికకు అప్పగించి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
ఈ నేపథ్యంలో ఈ శనివారం జరిగే ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా సాగబోతోంది. శనివారం ఎపిసోడ్ లో వేదని తమ వైపు తిప్పుకుని యష్‌ని మరోసారి అడ్డంగా బుక్ చేయాలనుకుంటారు మాళవిక, అతని ప్రియుడు. ఇందులో భాగంగా వేదకు ఫోన్ చేసి ఇంటికి రప్పిస్తారు. ఇదే సమయంలో ఖుషీని ఆస్టల్‌లో చేర్పించాలని మాళవిక చేస్తున్న ప్రయత్నం వేదకు తెలుస్తుంది. అదే సమయంలో యష్ తల్లి మాలిని .. మా ఖుషీని మాకిచ్చేయ్ అని గోల చేస్తుంది.. అక్కడే వున్న వేదని చూసిన మాలిని ఈ ఇద్దరూ కలిసి మనల్ని మోసం చేస్తున్నారు యష్ అని అప్పుడే వచ్చిన యష్‌తో చెబుతుంది. ఆ తరువాత ఏం జరిగింది? .. వేదని మళ్లీ యష్, అతని తల్లి అపార్థం చేసుకున్నారా? .. మాళవిక, అతని ప్రియుడి ప్లాన్ ని వేద పసిగట్టిందా? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.