English | Telugu

 శ్రీ‌వ‌ల్లి ఎవ‌రు?.. కార్తీక్‌ని ఇబ్బందిపెట్టిన దీప‌

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. ఎపిసోడ్‌లు గ‌డుస్తున్నా కొద్దీ ఈ సీరియ‌ల్‌ని ద‌ర్శ‌కుడు బంక‌లా సాగ‌దీస్తూనే వున్నాడు.. ఒకరు పోతె ఇంకొక‌రు అన్న‌ట్టుగా సిటీ దాటినా కార్తీక్ , దీప‌ల‌కు విల‌న్‌ల బెడ‌ద త‌ప్ప‌కుండా చూసుకుంటున్నాడు. మోనిత బాధ త‌ప్పింద‌నుకుంటే వీరి పాలిట ఇంద్రాణిని దీంచేశాడు. సౌంద‌ర్య‌, ఆనంద‌రావుల‌కి చెప్ప‌కుండా ఇంటిని వ‌దిలి కొత్త ఊరికి కార్తీక్‌, దీప , పిల్ల‌లు చేరుకుంటారు. అక్క‌డ ఇంద్రాణి రూపంలో కొత్త ట్విస్ట్ మొద‌ల‌వుతుంది.

కంట‌త‌డి పెట్టిన `కార్తీక దీపం` న‌టి

ఈ శ‌నివారం 1220వ ఎపిసోడ్‌లోకి ఈ సీరియ‌ల్ ప్ర‌వేశిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఎలాంటి ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి... క‌థ ఏ మ‌లుపు తీసుకుంటోంది అన్న‌ది ఒక‌సారి చూద్దాం. సౌంద‌ర్య‌ ఏడుస్తూ వుండ‌గా ఆనంద‌రావు, ఆదిత్య బ‌య‌టికి వెళ్లి వ‌స్తుంటారు..`ఏమైనా తెలిసిందా అని సౌంద‌ర్య అడుగుతుంది. స‌మాధానం వుండ‌దు.. నా పెద్దోడు తిరిగి ఇంటికి వ‌స్తాడా? .. మ‌ళ్లీ మ‌మ్మీ అని న‌న్ను పిలుస్తాడా? అని బోరు మంటుంది. క‌ట్ చేస్తే ...దీప ఇంటిని శుభ్రంగా తుడిచేసి పిల్ల‌ల‌కి దుప్ప‌ట్లు ప‌రిచి ప‌డుకోమంటుంది. కార్తీక్‌ని పిల్ల‌ల ప‌క్క‌నే ప‌డుకోమ‌ని పిలుస్తుంది. నేల‌పై ప‌డుకోమ‌న‌గానే `సారీ మ‌మ్మీ మిమ్మ‌ల్ని ఇలా క‌ష్ట‌పెట్టాల్సి వ‌స్తోంది అని కార్తీక్ ఫీల‌వుతాడు...

ఇదిలా వుంటే బ‌య‌ట ఓ యువ‌తి ప్ర‌స‌వ వేద‌న‌తో ఆరుస్తూ వుంటుంది. `అమ్మా శ్రీ‌వ‌ల్లీ ఓర్చుకో... ఓర్చుకోమ్మా అంటూ ఓ ముస‌లావిడా.. ఓ వ్య‌క్తి ఆమెని ఓదారుస్తుంటారు. ఆ అరుపులు విని దీప‌, కార్తీక్‌, పిల్ల‌లు బ‌య‌టికి వ‌చ్చి చూస్తారు. ప్ర‌స‌వ వేద‌న‌తో బాధ‌ప‌డుతున్న ఆ యువ‌తిని చూసి దీప త‌ల్ల‌డిల్లిపోతుంది. దీప ద‌గ్గ‌రికి వెళ్లి హాస్పిట‌ల్‌కి తీసుకెళ్లండి అంటుంది. వెంట‌నే వారు డాక్ట‌ర్ లేడు అని స‌మాధానం చెబుతారు. ఇంత‌కీ శ్రీ‌వ‌ల్లి ఎవ‌రు? .. ఆమె కోసం కార్తీక్‌ని దీప ఎందుకు ఇబ్బంది పెట్టింది? ..చివ‌రికి కార్తీక్ ఏం చేశాడు? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.