కొంపముంచిన అషూరెడ్డి చెత్త ఐడియా!
on Dec 9, 2021

బిగ్‌బాస్ తో వెలుగులోకి వచ్చిన యూట్యూబర్ అషూరెడ్డి. కెరీర్ తొలినాళ్లలో జూనియర్ సమంతగా పాపులారిటీని సొంతం చేసుకున్న అషూరెడ్డి సెలబ్రిటీగా మారిపోయింది. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ టాటూని తన ప్రైవేట్ పార్ట్‌పై వేసుకుని వార్తల్లో నిలిచింది. నిత్యం సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ బోల్డ్ సెలబ్రిటీగా పేరు తెచ్చుకుంది. అంతే కాకుండా రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూలో పాల్గొని.. తను అతి చేస్తే చెంపలు వాయించి హాట్ టాపిక్‌గా మారింది.
ఇక ఓంకార్ నిర్వహిస్తున్న `కామెడీ స్టార్స్` షోలో హరితో కలిసి పులిహోరా కలుపుతూ ఎంటర్‌టైన్ చేస్తున్న అషూ రెడ్డి గత కొన్ని వారాలుగా ఆ షోకు దూరంగా వుంటోంది. దుబాయ్ ట్రిప్ కోసం వెళ్లి నెట్టింట సందడి చేసిన అషూ రెడ్డి ఆ తరువాత రెండు లక్షల పెట్టి హ్యాండ్ బ్యాగ్ కొన్నానని చెప్పి ఓ వీడియోని పోస్ట్ చేసి అందులో తన తల్లికి అడ్డంగా బుక్కై అల్లరి పాలైంది. తాజాగా ఇలాంటి ఓ చెత్త ఐడియాతో తన యూట్యూబ్ ఛానల్ కోసం ఓ వీడియోని పోస్ట్ చేసి అందరి చేత చివాట్లు తింటోంది.
ఈ వీడియో చూసిన వారంతా వ్యూస్ కోసం ఇంతలా దిగజారిపోతావా అంటూ అషూ పై దుమ్మెత్తిపోస్తున్నారు. అషూ తన తల్లిని ఆటపట్టించేందుకు ఓ ప్రాంక్ వీడియోని షూట్ చేసింది. ఈ వీడియో చూసిన ఎవ్వరికైనా సహజంగానే అషూరెడ్డిపై కోపం అసహ్యం వేస్తాయి. ఇక నెటిజన్‌ల కి .. ఆమె అభిమానులకు మాత్రం ఓ రేంజ్‌లో మండింది. అంతలా మండటానికి గల కారణం ఏంటంటే తను ప్రెగ్నెంట్ అని తన తల్లినే ఆటపట్టిస్తూ అషూ రెడ్డి వీడియో చేయడం.. దాన్నే తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేయడం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



