English | Telugu
'నీ బాణం నీకే తిరిగి గుచ్చుకోకుండా చూసుకో'.. అభికి యష్ వార్నింగ్!
Updated : Aug 1, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ఎన్నెన్నో జన్మల బంధం`. నిరంజన్, డెబ్జాని మోడక్ జంటగా నటించారు. బెంగళూరు పద్మ, ప్రణయ్ హనుమండ్ల, మిన్ను నైనిక, జీడిగుంట శ్రీధర్, ఆనంద్, సులోచన, వరదరాజులు తదితరులు నటించారు. గత కొన్ని వారాలుగా స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ విజయవంతంగా ముందుకు సాగుతోంది. కైలాష్ ని కలిసిన కాంచన తన తల్లికి విషయం చెప్పడంతో మాలిని కైలాష్ ని విడిపించమని, కేసు వాపస్ తీసుకోమని యష్ తో అంటుంది. అతని భవిష్యత్తుని దేవుడు రాస్తాడని యష్ ఆఫీస్ కి వెళ్లిపోతాడు.
ఇదిలా వుంటే వేద ఇంట్లో జరిగిన విషయాన్ని చెప్పడానికి మాళవిక ఫ్రెండ్ తార ఇంటికి వస్తుంది. "వేద మీద నువ్వు గెలవబోతున్నావ్ కంగ్రాట్స్" అంటూ విష్ చేస్తుంది. యష్ మీద పైచేయి సాదించబోతున్నావని అభిమన్యుతో చెబుతుంది. "యష్ ఇంట్లో సునామీ పుట్టించిందిది, వాళ్లని అల్లాడించింది, దిక్కుతోచని పరిస్థితులు కల్పించింది. ఆ సునామి పేరు కైలాష్." అని చెబుతుంది. దీంతో హ్యాపీగా ఫీలైన మాళవిక, అభిమన్యు ఇదే అదనుగా కైలాష్ ని అడ్డుపెట్టుకుని యష్‌ను దెబ్బకొట్టాలనుకుంటారు.
కట్ చేస్తే.. యష్ ఎదురుపడటంతో "నువ్వు ప్రతీ విషయంలో కామాలు పెడుతూ వెళుతున్నావు.. నేను ఏకంగా ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాను" అంటాడు అభిమన్యు. "నా మీద గెలుద్దామనే!.. ఉక్రోషం వుంటే సరిపోదు.. వ్యూహం వుండాలి" అంటూ వెటకారం చేస్తాడు యష్. "ఆ వ్యూహాలే రచించడానికి వెళ్తున్నాను. నీ మీద సంధించడానికి వెళుతున్నాను" అంటాడు అభిమన్యు. "అయితే ఆ బాణం నీకే తిరిగి గుచ్చుకోకుండా చూసుకో" అని హెచ్చరిస్తాడు యష్. ఏం జరగనుందన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.