English | Telugu

శ్రీముఖి ఇంటి పనులు నేర్చుకో ముందు అప్పుడే చరణ్ తో పెళ్లి చేస్తాం

సరిగమప సెమి ఫినాలే పోటీ మంచి రసవత్తరంగా సాగింది. అద్దిరిపోయే గాత్రంతో ఇంకా దుమ్ము రేపే పాటలతో షోని ఆద్యంతం నవ్విస్తూ, కవ్విస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు సింగర్స్ . సాయి చరణ్ ఈ షో కంటెస్టెంట్ గా వచ్చి "ఆ నీలి గగనాల" సాంగ్ లీనమైపోయి అత్యద్భుతంగా పాడి వినిపిస్తాడు. ఫైనల్ గా శ్రీముఖి కూడా వచ్చేసి మరో చరణం పాడేసి అందరితో శభాష్ అనిపించుకుంటుంది. ఇక వాళ్ళ లవ్ ట్రాక్ కి కోటి గారు కౌంటర్ వేస్తారు. "ఇంకెందుకు ఆలస్యం త్వరగా పూలదండలు తీసుకురండమ్మా, పెళ్ళిచేసేద్దాం" అన్నట్టుగా అనేసరికి వెంటనే శ్రీముఖి కేరింతలు కొడుతోంది. ఇక చరణ్ వాళ్ళ నాన్నను స్టేజి మీదకు పిలుస్తుంది. ఐతే చరణ్ వాళ్ళ అమ్మ తనని మూడు ప్రశ్నలు అడగమన్నారని వాటికి సరైన జవాబులు చెప్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పిందని చెప్తారు. వెంటనే ప్రశ్నలు అడిగేయండి చెప్తాను అంటూ ఫుల్ ఖుషితో అడుగుతుంది శ్రీముఖి. " ముగ్గు వేయడం వచ్చా" అని అడుగుతారు "ముగ్గులోకి దింపడం వచ్చు మావయ్య" అంటుంది. "వంటొచ్చా" అని అడిగేసరికి " తినడం వచ్చు మావయ్య" అంటుంది. ఆ ఆన్సర్ కి ఒక్కసారి షాక్ ఐపోతారు చరణ్ వాళ్ళ నాన్న.

లేదు లేదు అప్పుడప్పుడు వంటలు కూడా ట్రై చేస్తుంటాను అని చెప్పేసరికి "గుత్తివంకాయ కూర చేయడం వచ్చా" అని అడుగుతాడు. "గుత్తి వంకాయ కూరను ఆన్లైన్ లో ఆర్డర్ చేయగలను"అంటుంది. నీకసలు గుత్తి వంకాయ కూర చేయడం రాదు కదా అని సీరియస్ గా అనేసరికి "నీకెప్పుడూ గుత్తి వంకాయ కూర ఇష్టమని ఎప్పుడూ చెప్పలేదు" అని చరణ్ వైపు చూసి అడిగేసరికి "యాక్టువల్ గా నాకు ఇప్పటివరకు అది ఇష్టమన్న విషయం తెలియదు" అంటాడు . మూడు ప్రశ్నల్లో రెండు అవుట్ . సరే ఫైనల్ గా "ఇస్త్రీ చేయడం వచ్చా" అని అడుగుతారు. "ఇస్త్రీ చేయడం వచ్చు రైట్ నుంచి లెఫ్ట్ కి లెఫ్ట్ నుంచి రైట్ కి ఇస్త్రీపెట్టెను తిప్పుతూ మొన్న చరణ్ జాకెట్ ఇస్త్రీ చేశా" అంటుంది. అలా ఎలా చేసావ్ "ముందు స్విచ్ వేయాలి కదా" అని చరణ్ వాళ్ళ నాన్న అనేసరికి స్టేజి మొత్తం నవ్వులు పువ్వులౌతాయి. నువ్ ప్రశ్నలన్నిటికీ ఆన్సర్ ఇవ్వలేదు ఇంకా నేనేం చేయలేను నీ ఇష్టం మా వాడి ఇష్టం అనేసరికి శ్రీముఖి బాధపడుతూ ఈ గ్రాండ్ ఫినాలే లోపు మీరు చెప్పిన పనులన్నీ నేర్చుకుంటాను అప్పుడు ఒప్పుకుంటారా అంటుంది. సరే అని తల ఊపుతాడు చరణ్ వాళ్ళ నాన్న. అలా శ్రీముఖి, చరణ్ లవ్ ట్రాక్ కి బ్రేక్ పడింది.

Podharillu: మహా పెళ్ళికి అంతా ఫిక్స్.. చక్రిని ఆమె అర్థం చేసుకుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -12 లో.....మహా తన డ్రీమ్ గురించి భూషణ్ కి చెప్తుంది. డ్రీం లేదు ఏం లేదు ఫ్యామిలీ ని చూసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చింది వండి పెడుతూ వెళ్ళేటప్పుడు బై చెప్పి వచ్చేటప్పుటికీ అందంగా రెడీ అయి ఉంటే చాలని చెప్పగానే వీడితో అనవసరంగా నా డ్రీమ్ గురించి చెప్పానని మహా అనుకుంటుంది. అదంతా చక్రి వింటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందంట కదా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏ సైలెంట్ గా ఉండు.. ఈ విషయం కన్నాకి తెలియదని మాధవ అంటాడు.

Brahmamudi: రాజ్ తీసిన యాడ్ సక్సెస్.. ధాన్యలక్ష్మి ఇచ్చిన బిగ్ ట్విస్ట్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -911 లో..... అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒకావిడని రౌడీలు వెంబడిస్తారు. అప్పుని చూసి ఆవిడ దగ్గరికి వచ్చి.. మేడం కాపాడండి అంటుంది. రౌడీలు పోలీసులని చూసి పారిపోతారు. మేడమ్ వాళ్ళు నా నగలు దొంగతనం చెయ్యాలని వెంబడిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు. చాలా థాంక్స్ మేడమ్ అని ఆవిడ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తానని అప్పు అంటుంది. ఆవిడ ఇంటిముందు దింపుతుంది...

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.