English | Telugu
'కప్పలా డాన్స్ చేస్తున్నావ్ కప్పదాన'.. శ్రీముఖిని తిట్టిన అవినాష్!
Updated : Aug 1, 2022
జీ తెలుగుతో పోటాపోటీగా స్టార్ మా కూడా మంచి షోస్ ని ప్లాన్ చేస్తోంది. అసలే వర్షాకాలం మొదలయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. అందుకే ఆడియన్స్ ఎవరూ ఇంట్లోంచి బయటకి కదలకుండా ఉండడం కోసం ఈ వారం "ఈ వర్షం సాక్షిగా" అనే ప్రోగ్రాంని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చి ఎంటర్టైన్ చేసింది. ఇందులో శ్రీముఖి, అవినాష్ 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' అనే ట్రావెల్స్ నడుపుతూ బిజినెస్ చేస్తూ ఉంటారు. ఐతే శ్రీముఖి బిజినెస్ విషయాలు చూడకుండా చిరంజీవి సాంగ్ కి వర్షంలో డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అదే టైంకి అవినాష్ వచ్చి, "ఆపు.. చేసిన డాన్స్ చాలు.. నువ్ డాన్స్ చేస్తుంటే వచ్చే వర్షం కూడా వెనక్కి వెళ్ళిపోతుంది" అంటాడు. అంతే శ్రీముఖి ముఖం మాడిపోతుంది.
"బిజినెస్ గురించి నువ్వస్సలు ఆలోచించట్లేదు శ్రీ" అంటాడు అవినాష్. "అవును కదా.. మనకు బిజినెస్ ఉంది కదా" అంటుంది శ్రీముఖి. "హా.. నువ్వేమో కపుల్స్ గురించి ఆలోచించకుండా కప్పలా డాన్స్ చేస్తున్నావ్" అంటాడు. ఆ మాటకు శ్రీముఖి ఫీల్ ఐపోతుంది. వెంటనే అవినాష్ దణ్ణం పెడతాడు.. సారీ అన్నట్టుగా. అలా వీళ్ళ హనీమూన్ ట్రావెల్ బిజినెస్ ని ఈ షోలో స్టార్ట్ చేశారు.
తర్వాత కొంతమంది కపుల్స్‌ని పిలిపించారు. అంబటి అర్జున్, సుహాసిని, నిరుపమ్, మంజుల, మహేశ్వరీ, శివ, నిఖిల్, కావ్య, రవికృష్ణ, నవ్యస్వామి, మానస్, కీర్తి.. వీళ్లందరితో డాన్సలు చేయించింది శ్రీముఖి. "ఏదేమైనాఈ స్టేట్ లో ఫాలోయింగ్ ఉండేది ఇద్దరే ఇద్దరికి. ఒకటి ఆ మహేష్ బాబుకి, రెండు ఈ డాక్టర్ బాబుకి" అంటూ నిరుపమ్ మీదపంచ్ డైలాగ్ వేసింది. "ప్రతీ అమ్మాయి మనసులో ఉండేది ఇద్దరే ఇద్దరు.. ఒకటి ఆ శ్రీకృష్ణుడు ఐతే, ఇంకొకరు ఈ రవిక్రిష్ణుడు" అంటూ రవిక్రిష్ణకు మంచి కంప్లిమెంట్ ఇచ్చేసింది శ్రీముఖి. ఇలా ఈ జంటలకు ఎన్నో టాస్కులు ఇచ్చి ఆడిస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది శ్రీముఖి. 'డీపెస్ట్ మాన్సూన్ రొమాంటిక్ కపుల్'గా రవికృష్ణ, నవ్య స్వామిని ఎంపిక చేసింది శ్రీముఖి. ఇలా ఈ వారం వర్షం ఎపిసోడ్ ఫుల్ మస్తీ చేసేసింది.