Read more!

English | Telugu

నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు.. నేను నిన్ను మళ్ళీ కలుస్తా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ 902 లో.. మహేంద్ర డ్రింక్ చేస్తూ ఎక్కడికి వెళ్తున్నాడో అర్థం కాకుండా వెళ్తుంటాడు. మరొకవైపు వసుధార, రిషి ఇద్దరు కలిసి మహేంద్ర ఎక్కడికి వెళ్లాడోనని కంగారుపడుతు వెతుకుతుంటారు. మరొక వైపు ఒక ఆవిడ నేచర్ ని  ఫొటోస్ తీస్తూ ఉంటుంది.

మరొక వైపు మహేంద్ర వెళ్తుండగా తన పర్సు కిందపడిపోతుంది. అప్పుడే ఆవిడ ఫొటోస్ తీస్తుండగా పర్సు కన్పించి, ఆ పర్సు ఇవ్వడానికి మహేంద్రని పిలుస్తుంది. ఆ తర్వాత మహేంద్ర ఒక దగ్గర కూర్చొని ఉంటాడు. అతని దగ్గర ఒక రాయిపై జగతి, మహేంద్ర, అనుపమ అని రాసి ఉంటుంది.. అది చూసిన మహేంద్ర ఎమోషనల్ అవుతాడు. మరొకవైపు పర్సు తీసుకొని మహేంద్ర దగ్గరకి వస్తుంది ఆవిడ. తనని చూసిన మహేంద్ర షాక్ అవుతాడు. " అనుపమ.. నువ్వేంటి ఇక్కడ"  అని అడుగుతాడు. నువ్వు ఏంటి ఇక్కడ అని అనుపమ మహేంద్రని అడుగుతుంది. ఆ తర్వాత మహేంద్ర, అనుపమ జగతితో ఉన్న జ్ఞాపకాలు గుర్తుకు చేసుకుంటాడు. జగతి ఎక్కడ అని అనుపమ మహేంద్రని అడుగుతుంది. జగతి లేదు అన్న విషయం తెలిస్తే అనుపమ తట్టుకోలేదని మహేంద్ర సైలెంట్ గా ఉంటాడు. జగతి జీవితంతో ఆడుకుంటున్నావ్ కదా? ఎప్పుడో మీరు దూరంగా ఉంటున్నారని తెలిసింది కానీ ఇప్పుడు నువ్వు మౌనంగా ఉంటున్నవ్ అది నిజం అని అర్థం అవుతుందని అనుపమ అంటుంది. జగతి ఎక్కడ ఉంది? నేను వెళ్లి మాట్లాడతా అని అనుపమ అనగానే.. నేను తర్వాత కలిసినప్పుడు చెప్తానని, జగతి లేదన్న విషయం చెప్పకుండా డైవర్ట్ చేస్తాడు. మరొకవైపు రిషి, వసుధార ఇద్దరు మహేంద్ర గురించి వెతుక్కుంటూ వస్తారు. " నీ అడ్రెస్ చెప్పు, వచ్చి జగతి గురించి తెలుసుకోవాలి" అని అనుపమ అడుగుతుంది. మళ్ళీ కలిసినప్పుడు జగతి గురించి చెప్తాను. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు అని‌ అనుపమతో మహేంద్ర అంటాడు.

ఆ తర్వాత అనుపమ వెళ్తుండగా.. రిషి, వసుధార ఇద్దరు వస్తారు. మహేంద్ర దగ్గరికి వచ్చిన ఆవిడా ఎవరు అని రిషి అడుగుతాడు. అడ్రెస్ కావాలంటే చెప్పానని మహేంద్ర అంటాడు. ఆ తర్వాత మహేంద్రని రిషిని తీసుకొని వెళ్తుంటాడు. వసుధార మాత్రం అక్కడ రాయిపై రాసి ఉన్నా పేర్లు చూసి ఈ అనుపమ ఎవరని అనుకుంటుంది. మరొకవైపు అనుపమకి వాళ్ళ పెద్దమ్మ వీడియో కాల్ చేసి మాట్లాడుతుంది. నాకు మహేంద్ర కన్పించాడని అనుపమ చెప్పగానే.. ఏంటి మహేంద్ర కన్పించడా అని వాళ్ళ పెద్దమ్మ షాక్ అవుతుంది.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.