Read more!

English | Telugu

పల్లవి ప్రశాంత్ నామినేషన్.. అమర్ దీప్ బూతులు!

బిగ్ బాస్ హౌస్ లో సోమవారం నుండి సాగుతున్న నామినేషన్లు మంగళవారానికి చేరుకున్నాయి. అయితే ఈ నామినేషన్లు ఒక మినీ యుద్ధాన్ని తలపించాయి. అమర్ దీప్, గౌతమ్ కృష్ణని పల్లవి ప్రశాంత్ నామినేట్ చేశాడు.

గౌతమ్ కృష్ణ నామినేట్ చేసిన రీజన్ నచ్చలేదని అతనిని నామినేట్ చేశాడు ప్రశాంత్. నీకు అసలు రీజనే లేదు. కానీ నామినేట్ చేస్తున్నావంటూ గౌతమ్ డిఫెండ్ చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత అమర్ దీప్ ని నామినేట్ చేసిన ప్రశాంత్.. " మా టీమ్ అతను భోలే షావలి. అతను ఆడలేదని మీరన్నారు. కానీ మా టీమ్ అంతా మాట్లాడుకున్నాం. అతను సాక్రిఫైజ్ చేస్తేనే మేం ఆటలో ముందుకెళ్ళాం. అతడిని అలా ఎలా అంటావ్. ఆ రీజన్ నాకు నచ్చలేదు" అంటూ అమర్ దీప్ ని నామినేట్ చేయగా.. నీ దగ్గర సరైన రీజన్ లేదు‌. నామినేషన్ పాయింట్ మాట్లాడు. అతడిని నామినేట్ చేస్తే, నువ్వు నన్ను నామినేట్ చేయడమేంటని అమర్ దీప్ అనగానే.. అతను మా టీమ్ అంటు భోలే అన్నాడు. మధ్యలో ఎవడైన మాట్లాడితే పగిలిపోద్ది అని కుర్చీని తన్నేశాడు అమర్ దీప్. మీరు శివాజీ అన్నకు హ్యాండ్ బాలేదని, ఫిజికల్ గా ఆడలేడని చెప్పడం నాకు నచ్చలేదని అమర్ దీప్ తో పల్లవి ప్రశాంత్ అన్నాడు. అది విన్న అమర్.. ఇది కదా రీజన్ అంటే, ఇది ముందే చెప్పాలి కదరా అంటూ రెచ్చిపోయాడు. అరేయ్ అలా ప్లిప్ అవ్వకూడదు. నీకు నచ్చినట్టు మాట్లాడకూడదంటూ శివాజీ అనగానే.. అన్న మీరు వాడికి సపోర్ట్ చేయాలనుకుండే డైరెక్ట్ గా సపోర్ట్ చేయండి అన్న అమర్ అన్నాడు. అలా ఎందుకు మాట్లాడుతున్నావంటూ, ఇది నా‌ రీజన్ అని  ప్రశాంత్ అనగా..ఎవడెన్ని ఎదవ ప్లాన్ లు వేసిన నన్ను హౌస్ నుండి పంపియ్యలేరు. బయటకు పోతే కప్పుతోనే పోతాను, ఐ ఆమ్ బ్యాక్ అని అమర్ దీప్ అన్నాడు. అసలు నా పాయింట్ విను అన్నా అని ప్రశాంత్ అనగా.. ఏ రా నా‌ కొడక నేను చెప్పేది వినరా అంటూ ఫుల్ హైప్ అయ్యాడు.


భోలే షావలి తన మొదటి నామినేషన్ గా శోభాశెట్టి, రెండవ నామినేషన్ గా గౌతమ్ కృష్ణని చేశాడు. " నేను అలా పొరపాటున బూతు మాట్లాడినందుకు చాలాసార్లు సారీ చెప్పాను. నువ్వు సరే అన్నావ్. కానీ మొన్న నాగార్జున గారు వచ్చినప్పుడు .. అసలు క్షమించలేనని అన్నావ్. ఇప్పటికైనా నువ్వు నన్ను క్షమించానని చెప్తే ఈ నామినేట్  చేయను" అని శోభాశెట్టితో భోలే షావలి అనగానే.. తనలోని మోనిత బయటకొచ్చింది. నువ్వు నామినేషన్ చేస్తే బయపడేరకం కాదు. అది నా క్యారెక్టర్ కాదు‌. నామినేషన్ చేసుకో, నిన్నెప్పుడూ క్షమించలేనని శోభాశెట్టి అంది‌. ఇలా ఒక్కొక్క కంటెస్టెంట్స్ ఇద్దరిని నామినేట్ చేసారు.‌ ఒక హౌస్ మేట్ కి రెండు లేదా అంతకన్నా ఎక్కువ నామినేషన్లు వస్తే వారిని నామినేషన్ల లిస్ట్ లో ఎంపిక చేసాడు బిగ్ బాస్. ఈ వారం శోభాశెట్టి, భోలే షావలి, శివాజీ, అశ్విని, ప్రియాంక, అమర్ దీప్, సందీప్, గౌతమ్ కృష్ణ నామినేషన్లో ఉన్నారు.