English | Telugu
Guppedantha Manasu : కొడుకుని ఆ సిచువేషన్ లో చూసి ఏడ్చేసిన నాన్న.. సాధించావమ్మా కోడలా!
Updated : Jan 6, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -966 లో.. రిషిని చక్రపాణి దగ్గరకి తీసుకొని వస్తుంది వసుధార. ఆ తర్వాత తన దగ్గరే ఉండి జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇక కాసేపటికి అసలు ఏం జరిగిందని వసుధారని చక్రపాణి అడుగుతాడు. ఇదంతా శైలేంద్ర చేస్తున్న కుట్ర అని వసుధార చెప్తుంది. మరి అందరికి చెప్పి వాడికి శిక్ష పడేలా చెయ్యాలని చక్రపాణి అంటాడు. రిషి సర్ గురించి మావయ్యకి తెలియదు ఉదయం చెప్పాలని వసుధార అంటుంది.
మరుసటి రోజు ఉదయం ఎందుకు ఇలా జరుగుతుందని మహేంద్ర టెన్షన్ పడుతుంటాడు. రిషి కన్పించడం లేదని బాధని దాచుకోని తిరుగుతున్నాను. ఇప్పుడు వసుధార కన్పించడం లేదు ఏమైంది? అసలు ఎక్కడ ఉందని అనుపమతో మహేంద్ర అంటాడు. నువ్వు టెన్షన్ పడకని మహేంద్రకి అనుపమ ధైర్యం చెప్తుంది. అప్పుడే వసుధార ఫోన్ నుండి మహేంద్రకి కాల్ వస్తుంది. వసుధా ఫోన్ చేస్తుందని అనుకుని మహేంద్ర ఎక్సయిట్ మెంట్ తో లిఫ్ట్ చేస్తాడు. కానీ రిషి మాట్లాడతాడు. హలో డాడ్ అని రిషి అనగానే మహేంద్ర సంతోషానికి అవధులు లేకుండా పోతాయ్. ఎక్కడ ఉన్నావ్ నాన్న రిషి? ఎలా ఉన్నావంటూ ఎమోషనల్ అవుతాడు. మీరేం కంగారు పడకండి డాడ్. నేను బాగున్నానని రిషి చెప్తాడు. ఆ తర్వాత రిషితో అనుపమ మాట్లాడుతుంది. ఇప్పుడు చక్రపాణి మావయ్య ఇంట్లో ఉన్నామని అనగానే సరే వస్తున్నామని మహేంద్ర, అనుపమ ఇద్దరు బయలుదేర్తారు. ఆ తర్వాత అనుపమ మహేంద్ర ఇద్దరు రిషి దగ్గరకి వస్తారు. రిషి దగ్గరకి మహేంద్ర వెళ్లి హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతాడు. అసలు ఈ దెబ్బలు ఏంటి నాన్న అని రిషిని మహేంద్ర అడుగుతాడు. రిషి మౌనంగా ఉంటాడు. ఇప్పుడు సర్ ఎక్కువ సేపు కూర్చొలేకపోతున్నారు నడవలేకపోతున్నారని వసుధార చెప్తుంది. కాసేపటికి జరిగింది మొత్తం మహేంద్రకి వసుధార చెప్తుంది.
అసలు రిషిని నువ్వు ఎలా కలిసావని వసుధారని మహేంద్ర అడుగుతాడు. రిషి సర్ కాల్ చేసి చెప్పారు. నేను వెళ్తుంటే కూడా రౌడీలు నన్ను ఫాలో అయ్యారు. వాళ్ళని డైవర్ట్ చేసి సర్ ని కలిసాను. ఆ తర్వాత వాళ్ళు నన్ను కిడ్నాప్ చేశారు. రిషి సర్ ముకుల్ కి కాల్ చేయగానే సర్ వచ్చి కాపాడారని వసుధార చెప్పగానే.. ఇంత జరిగితే నాకెందుకు చెప్పలేదని మహేంద్ర అంటాడు. ఆ సిచువేషన్ లో నాకు రిషి సర్ ని కలవాలన్న అలోచన తప్ప ఏం తోచలేదని వసుధార చెప్తుంది. కాసేపటికి రిషి మన ఇంటికి వెళదాం పదా అని మహేంద్ర అనగానే.. వద్దు మావయ్య ఇక్కడ అయితేనే సర్ సేఫ్ గా ఉంటారని వసుధార అంటుంది. మహేంద్ర కూడ ఒప్పుకుంటాడు. కాసేపటికి రిషికి వసుధార బ్రెడ్ తినిపిస్తుంది. మహేంద్ర ఆపిల్ తీసుకొని వస్తాడు. ఇద్దరు తినండి. నువ్వు ఎలాగైనా సాధించావ్.. నీ రిషి సర్ ని కాపాడుకున్నావంటూ వసుధారని మహేంద్ర పొగుడుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.