English | Telugu
బిగ్ బాస్ పేరుతో మోసం.. యాంకర్ స్వప్న చౌదరి సంచలన వీడియో!
Updated : Jan 6, 2024
మోసం అన్ని చోట్లా జరుగుతుంది అనడానికి ఇది కూడా ఒక ఉదాహరణే...బుల్లితెర మీద కూడా చాల మోసాలు జరుగుతూ ఉంటాయి..కానీ చాల వరకు బయటకు రావు..ఎవరైనా ధైర్యం చేసి బయట పెడితేనే అవి కూడా తెలుస్తాయి..ఇప్పుడు బిగ్ బాస్ విషయంలో ఒక మోసం జరిగిందన్న విషయం రీసెంట్ గా బయటపడింది. యాంకర్ కమ్ యాక్టర్ స్వప్న చౌదరి (Swapna Chowdary) ఈ విషయంలో మోసపోయింది. ఆ విషయాన్ని తానే ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేసారు. "రేలార్" టీవీ షోకి యాంకర్‌గా వ్యవహరించింది స్వప్న. అలాగే "నమస్తే సేట్‌జీ" అనే మూవీలో కూడా నటించింది. బిగ్ బాస్ (Bigg Boss)కి వెళ్ళాలన్న ఆమె ఆశను కొంతమంది కాష్ చేసుకున్నారని చెప్పారు.
"బిగ్ బాస్‌కి వెళ్లడమంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టమంటే.. నేను కనే కలలో కూడా.. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నట్లు ఊహించుకుంటాను. బిగ్ బాస్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు అన్నీ సీజన్స్ ఫాలో అయ్యాను. బిగ్ బాస్ సీజన్ 7లో హౌస్‌లోకి పంపిస్తాను అని చెప్పి తమ్మాలి రాజు అనే వ్యక్తి నా దగ్గర నుంచి రూ. 2.50 లక్షలు తీసుకున్నాడు. డబ్బులు ఎందుకు ఇవ్వాలి అని అడిగితె పీఆర్, రేటింగ్ పెంచుకోవడం, కాస్ట్యూమ్ కోసం అని చెప్పారు. డబ్బులు తీసుకోవడమే కాకుండా ఫోటో షూట్ కూడా చేశారు. దాని కోసం రూ. 25 వేలు ఖర్చు అయ్యింది. జూన్‌లో డబ్బులు ఇచ్చాను..కానీ బిగ్ బాస్ షోకి వెళ్లలేకపోయా.. అడిగితే.. బిగ్ బాస్ 8లో పంపిస్తామన్నారు. ఇదిగోండి నాకు ఆయన ఇచ్చిన అగ్రిమెంట్.. బిగ్ బాస్ సీజన్ 7 లో హౌస్ లోకి పంపలేకపోయాను కాబట్టి డిసెంబర్‌లో డబ్బు తిరిగి ఇస్తానని కూడా రాశారు. బిగ్ బాస్ కోసం నేను అప్పు చేసి ఇచ్చాను. నా పరిస్థితి బాగోలేదని చెప్పాను..అప్పుడు కూడా వైల్డ్ కార్డు ద్వారా పంపిస్తాను అని చెప్పాడు. నా డబ్బు డిసెంబర్ 20 లోగా ఇస్తానని చెప్పి ఆ తర్వాత జనవరి 6 న ఇస్తానని చెప్పాడు. ఇప్పడు ఫోన్ చేసి డబ్బు అడుగుతుంటే 'పోలీస్ స్టేషన్ లో కంప్లైట్ ఇస్తావా.. ఇచ్చుకో, ప్రెస్ మీట్ పెడతావా పెట్టుకో’ అని సమాధానం ఇస్తున్నాడు. బిగ్ బాస్ టీమ్ ఇది గమనించండి. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు" అని తన వీడియోలో చెప్పింది యాంకర్ కమ్ యాక్టర్ స్వప్న చౌదరి.