English | Telugu

సూపర్ సింగర్ జూనియర్ టైటిల్ విన్నర్ సుదీక్ష!

బుల్లి తెర చరిత్రలో ఎంతోమంది సూపర్‌ సింగర్స్‌ను వెలుగులోకి తీసుకొచ్చిన స్టార్‌ మా సూపర్‌ సింగర్‌ జూనియర్‌ పోటీల ఫైనల్స్‌ ముగిసాయి . 13 వారాలు 14 మంది జూనియర్స్ ఇందులో పోటీ పడ్డారు. ఇక ఈ షో ఫైనల్స్‌లోకి ఐదుగురు చేరుకున్నారు. ఇక ఈ ఫైనల్ ఈవెంట్ ఎంతో గ్రాండ్ లుక్ తో అదరగొట్టేసింది. ఈ ఎపిసోడ్‌కు మెయిన్ గెస్ట్స్ గా అక్కినేని నాగార్జున, బ్రహ్మానందంతో పాటు "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి" మూవీ యూనిట్ కృతిశెట్టి, సుధీర్‌ బాబు, ఇంద్రగంటి మోషనకృష్ణ వచ్చేసారు.

ఈ ఫైనల్స్‌కు సీనియర్ సింగర్స్ చిత్ర, మనో, హేమచంద్ర, రనీనా రెడ్డి జడ్జెస్ గా, అనసూయ, సుధీర్‌ హోస్ట్‌గా వ్యవహరించారు. ఇక ఈ ఫైనల్స్ లో పోటాపోటీగా పాడారు కంటెస్టెంట్స్. ఫైనల్లీ సుధీక్ష సూపర్ సింగర్ జూనియర్ టైటిల్ ని గెలుచుకుంది. హీరో నాగార్జున చేతుల మీదుగా ట్రోఫీని 10 లక్షల కాష్ ప్రైజ్ ని అందుకుంది. మయూఖ్ సూపర్ సింగర్ జూనియర్స్ రన్నరప్ గా నిలిచి 3 లక్షల కాష్ ప్రైజ్ అందుకున్నాడు. ఇక థర్డ్ ప్లేస్ లో నిలిచినందుకు భువనేష్ కి 2 లక్షల కాష్ ప్రైజ్ ఇచ్చారు. ఇక నాగార్జున మాట్లాడుతూ "నాకు ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు.

" అలాగే కింగ్ పుట్టినరోజును పురస్కరించుకుని గిటార్ ని గిఫ్ట్ గా ఇచ్చారు అందరూ. "రాము బావ..మమ్మల్ని ఇలా ఎప్పుడూ ఇన్స్పైర్ చేస్తుండాలి" అంటూ అనసూయ "ఆనాటి భారతంలో మా అర్జున..సినీ రంగంలో గ్రేట్ మా నాగార్జున" అంటూ మనో, "స్టే బ్లెస్సెడ్" అంటూ చిత్రమ్మ, "హ్యాపీ బర్త్ డే వన్ అండ్ ఓన్లీ కింగ్ " అంటూ సుడిగాలి సుధీర్ గిటార్ మీద రాసి అందించారు. ఇలా ఒక పండగలా ఈ సీజన్ పూర్తయ్యింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.