English | Telugu

నేను ఎందుకు ఇంత లేట్ గా పుట్టాను ? బాధపడుతున్న ఆరియానా

ఆరియానా గ్లోరీ బుల్లి తెర మీద పరిచయం ఉన్న అమ్మాయే. సినిమా అనే రంగుల ప్రపంచంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఎంట్రీ ఇచ్చింది. కొన్ని ఇంటర్వూస్, కొన్ని మూవీస్ కొంతమందిని ఓవర్ నైట్ స్టార్ ని చేసేస్తాయి. ఇలా పాపులర్ అయినవాళ్ళలో అరియనా కూడా ఒక అమ్మాయి. అప్పట్లో ఈ అమ్మడు టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసిన కారణంగా రాత్రికిరాత్రే ఫుల్ పాపులర్ ఐపోయింది. ఇక తర్వాత తెలుగులో ఫేమస్ రియాల్టీ గేమ్ షో బిగ్ బాస్ షోలో ఆఫర్ వచ్చింది.

అందులో పోటాపోటీగా పార్టిసిపేట్ చేసింది. ఇక ఇప్పుడు ఈవెంట్స్, షోస్ చేస్తూ డబ్బులు సంపాదిస్తోంది..అలాగే యూట్యూబ్ ఛానల్ పెట్టి రకరకాల వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఆరియానా కింగ్ నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఒక క్రేజీ కామెంట్ చేసింది. " నేను ఎందుకు సర్ ఇంత లేట్ గా పుట్టాను. లవ్ యూ నాగ్ సర్...విష్ యూ హ్యాపీ బర్త్ డే" అంటూ నాగ్ తో కలిసి దిగిన ఫొటోస్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. ఈ కాప్షన్ కి నెటిజన్స్ కొందరు విష్ చేస్తుంటే కొందరు మాత్రం బూతులు తిట్టేస్తున్నారు ఆరియానని. ఐతే ఆరియానా ఇలాంటివి అస్సలు పట్టించుకోను అంటూ గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.