English | Telugu

రష్మీ తెలుగు కంటే నా తెలుగు చాలా బెటర్


చెఫ్ మంత్ర సీజన్ 2 ప్రతీవారం మంచి జోష్ తో ఎంటర్టైన్ చేస్తోంది. ఇప్పుడు ఆహాలో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ వారం జబర్దస్త్ స్టార్స్ ని ఇన్వైట్ చేసింది లక్ష్మి. యాంకర్ రష్మీ సెట్ లోకి అడుగుపెట్టేసరికి మంచు లక్ష్మి వెనక ముందు చూస్తూ రష్మీ వస్తే సుధీర్ కూడా రావాలి కదా అని చూస్తున్నా అనేసరికి రష్మీ నవ్వేసింది. ఇంతలో గెటప్ శీను సెట్ లోకి అడుగుపెట్టాడు. "మా బంగారు తల్లి ఫోన్ చేస్తుంటే ఫోన్ తియ్యకుండా ఏం చేస్తున్నావ్ బ్రదర్" అంటూనే ఇదిగో మాట్లాడు అని సెల్ ని రష్మీకి ఇచ్చాడు శీను. "హాయ్ సుధీర్" అనడంతో "హే రష్మీ" అని అవతల నుంచి వచ్చిన రెస్పాన్స్ కి రష్మీ సిగ్గుమొగ్గలయ్యింది. వెంటనే శీను "సిగ్గూ మొగ్గాయే" అని పాట పాడేశాడు.

ఇక ఇద్దరికీ గారెలు వేసే పోటీ పెట్టింది. వెంటనే కొన్ని ప్రశ్నలు అడిగింది "రష్మీ నటించిన ఫస్ట్ మూవీ పేరు ఏమిటి" అని అడిగింది. "అప్పుడొచ్చావా తల్లీ నువ్వు" అని శీను కౌంటర్ వేసాడు. "రష్మీ ని డైరెక్ట్ గా మీట్ ఐనప్పుడు వేసుకున్న కాస్ట్యూమ్ ఏమిటి" అని అడిగేసరికి "ఈ విషయం శీనుకి తెలియదు సుధీర్ గా బాగా తెలుసు "అని చెప్పకనే చెప్పేసరికి సుధీర్ ఇప్పుడు నెంబర్ చెప్పేస్తున్నా పబ్లిక్ గా అనేసరికి "ఎవరైనా వాళ్ళ భార్య నెంబర్ గుర్తుపెట్టుకుంటారు కానీ సుధీర్ నెంబర్ ఎందుకు గుర్తుపెట్టుకున్నావ్" అని రివర్స్ కౌంటర్ వేసింది రష్మీ. ఇక వడలు వేస్తూ "నా వడలో కూడా వన్ద్రం ఉంది " అంటూ కామెడీ చేసింది. ఇక మంచు లక్ష్మికి దొరికిందే సందుగా "నేను ఎక్కడికి వెళ్లినా రష్మీని వెంట తీసుకెళ్తా ఎందుకంటే రష్మీ తెలుగు ముందు నా తెలుగు చాలా బాగుంది" అంది.