English | Telugu
రష్మీ, నందు వేసిన దోశలు బ్లాక్బస్టర్!
Updated : Nov 2, 2022
'బొమ్మ బ్లాక్బస్టర్' మూవీ ప్రమోషన్స్ ని చాలా డిఫరెంట్ గా చేస్తున్నారు నందు, రష్మీ. ఇక ఇప్పుడు టేస్టీ తేజ కిచెన్ కి వచ్చి దోస ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేశారు. 'రష్మీ మేడంకి వంటొచ్చా?' అని తేజ అనేసరికి "నాకు వంట వచ్చు..నా వంట నేనే చేసుకుని తింటాను...నా పక్క వాళ్లకు కూడా పెడతాను. నచ్చిందా లేదా అనేది నా సమస్య కాదు." అని ఫన్నీ గా ఆన్సర్ ఇచ్చేసింది రష్మీ.
పెనాన్ని పిండి గిన్నె దగ్గరకు తీసుకొచ్చేసరికి తేజ పడీ పడీ నవ్వేసాడు. "పిండి పెనం దగ్గరకు కదా వెళ్ళాల్సింది.. పెనం పిండి దగ్గరకొచ్చిందేంటి" అనేసరికి "నేను సెట్ దోస వేస్తున్నా" అంది రష్మీ. ఇక రష్మీ పెనాన్ని ఊపేసరికి తేజ భయపడిపోయి "ఏంటండీ పెనాన్ని అలా చేస్తున్నారు?" అని అడిగాడు.
"దీన్ని ప్రొఫెషనలిజమ్ అంటారు" అని రష్మీ అనేసరికి "చైనీస్ వంటలు చేసేవాళ్ళు పెనాన్ని ఇలాగే తిప్పుతూ ఉంటారు" అన్నాడు నందు. ఇక తర్వాత నందు బాహుబలి దోశ వేసాడు. తర్వాత టేస్టీ తేజ ఎమోజిస్ ఛాలెంజ్ టాస్క్ ఇచ్చాడు. తన మొబైల్ లో కొన్ని రకరకాల ఎమోజిస్ చూపించి నందుని, రష్మీని అలాగే చేయమని చెప్పేసరికి వాళ్ళు కూడా వెరైటీగా ఫన్నీ గా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెట్టి నవ్వు తెప్పించారు.