English | Telugu

బిగ్‌బాస్ షో రెడ్‌లైట్ ఏరియా క‌న్నా డేంజ‌ర్

బుల్లితెరపై తెలుగు బిగ్ బాస్ ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తిచేసుకుంది. ఈరోజు నుంచి బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ పేరుతో ఓటీటీలో సందడి చేయనుంది. అయితే ఈ షోని మొదటి నుంచి వ్యక్తిరేస్తున్న ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ నేత నారాయ‌ణ మరోసారి బిగ్ బాస్ షోపై విరుచుకుపడ్డారు. ఈ షో రెడ్‌లైట్ ఏరియా క‌న్నా డేంజ‌ర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బిగ్‌బాస్ అనేది గేమ్‌ షో కాదని.. లైసెన్స్‌ తీసుకున్న బ్రోతల్‌ హౌజ్ అని నారాయ‌ణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సంబంధంలేని యువతి, యువకులను ఒకే ఇంట్లో ఉంచడం ఏంటని ఏంటని ప్రశ్నించారు. డబ్బుల కోసం కక్కుర్తిపడి ఇలాంటి షోలు చేయొద్దని సూచించారు. ఈ షో వల్ల సమాజం నాశనమైపోతుందని, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఈ షోను బ్యాన్‌ చేయాలని డిమాండ్ చేశారు. ‘స్టాప్‌ బిగ్‌బాస్‌’ అనే హ్యాష్‌ ట్యాగ్‌తో నారాయ‌ణ సోషల్ మీడియాలో యాంటి బిగ్‌బాస్‌ ప్రచారాన్ని కూడా మొదలు పెట్టారు.

నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ ఈరోజు నుంచే ఓటీటీ వేదిక డిస్నీ+హాట్ స్టార్ లో ప్రసారమవుతోంది. 17 మంది కంటెస్టెంట్స్ పాల్గొంటున్న ఈ షో 84 రోజుల పాటు సాగనుంది.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...