English | Telugu

బాబోయ్ బ్యాంకాక్ కి ఓ దండం!  

ఏదైన సరే మన దేశంలో మన ఊళ్ళో మన ఇంట్లో ఉన్నంత కంఫర్ట్ ఇంకెక్కడా ఉండదు. ఎక్కడికెళ్ళిన ఏదో వెలితి ఉంటుంది‌. ఇప్పుడు కాదు ఎప్పుడు అయిన అంతే. పటాస్ ప్రవీణ్ రీసెంట్‌గా బ్యాంకాక్ వెళ్ళాడు.

బజర్దస్త్ అనేది ఎంతోమంది కనుమరుగయిపోయిన వారికి, అప్‌కమింగ్ కమెడియన్లకు ఛాన్స్ ఇచ్చింది. అలాంటి వారిలో ఒకరు పటాస్ ప్రవీణ్. ముందుగా పటాస్ అనే స్టాండప్ కామెడీ షోతో పరిచయమయిన ప్రవీణ్.. తన ఐడెంటిటీనే పటాస్ ప్రవీణ్‌గా మార్చుకున్నాడు. బ్యాంకాక్ లో అన్ని టూరిజం లోకేషన్స్ చూసిన ప్రవీణ్ బాగా ఎంజాయ్ చేశాడు. అయితే అన్నీ చూడటానికి బాగున్నాయి కానీ తినడానికి ఏమీ బాలేవంట. అదే మన ఇండియాలో దొరికే రైస్, కర్రీస్ ఏమీ లేవంట.. ఎటు చూసిన పాములు, తేళ్ళు, కప్పలే కన్పిస్తున్నాయంట. తన యూట్యూబ్ ఛానెల్ లో ఓ వీడియోని అప్లోడ్ చేసి తన భాదని పంచుకున్నాడు పటాస్ ప్రవీణ్.

బయట ఏం తినేలా లేవు. సూపర్ మార్కెట్ కి వెళ్లి ఏవో తెచ్చిన.. అవి చూస్తే తినబుద్ది కావట్లేదు. ఇవేంటో అర్థం కాదు. నా బాధ ఎవలకి చెప్పుకోవాలో తెలియదు. ఏది తినాలన్న నరకం కన్పిస్తుంది. కడుపల ఎలుకలు ఉరుకుతున్నాయి నాకైతే.. ఎంతైన మన ఇంటికి కాడ మనం ముద్దుగా వండుకొని తింటే ఎంత బాగుంటుంది. లాస్ట్ కి ఏం తినలేక జామకాయ ముక్కని కారంలో ముంచుకొని తింటున్నా అని ప్రవీణ్ ఇందులో చెప్పాడు. బాబోయ్ బ్యాంకాక్ దండం అనే క్యాప్షన్ తో చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఫేమ్ పటాస్ ఫైమాతో కొన్నిరోజులు ప్రేమలో ఉన్న ప్రవీణ్.. కొన్ని రోజులకి ఇద్దరు విడిపోయారు. ఆ తర్వాత.. పల్లెటూరి పిల్ల పట్నం పిలగాడు, ప్రవీణ్ గాడి ఊరి ప్రేమకథ అనే వెబ్ సిరీస్ లతో ఆకట్టుకున్నాడు ప్రవీణ్.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.