Read more!

English | Telugu

కృష్ణకి మురారి జాడ తెలిసేనా.. ముకుంద నిజం చెప్పనుందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ ఎపిసోడ్-295 లో.. మురారి కోసం కృష్ణ హాస్పిటల్ మొత్తం వెదుకుతుంటుంది. శకుంతల దగ్గరికి వచ్చి ఏసీపీ సర్ కన్పించాడా అంటూ అడుగుతుంది. మరొక వైపు ముకుంద అన్నయ్య మురారి సర్జరికి సంబంధించిన సంతకాలు  పెట్టుకొని పరిమళ మేడమ్ కి ఇస్తాడు.

మరొక వైపు ముకుంద వాళ్ళ అన్నయ్య ముకుందతో ఫోన్ లొ మాట్లాడుతాడు. రేపటికి అల్ల పని పూర్తి అవుతుందని ముకుంద అన్నయ్య చెప్పగానే ముకుంద టెన్షన్ పడుతుంది ఈ విషయం బయట ఎవరికైనా తెలిస్తే మొదటికే మోసం వస్తుందని ముకుంద అనగానే.. నువ్వేం టెన్షన్ పడకని ముకుంద వాళ్ళ అన్నయ్య చెప్తాడు. ఆ తర్వాత ముకుంద అన్నయ్య ఫోన్ కట్ చెయ్యగానే తన చుట్టూ పోలీసులు ఉంటారు. ఎందుకు వచ్చారని ముకుంద వాళ్ల అన్నయ్య అడగ్గానే.. మురారిని  నువ్వే చంపావని‌ మాకు తెలుసని పోలీసులు చెప్తారు. అలా అని ఎవరు చెప్పారని అనగానే.. శ్రీనివాస్ వచ్చి నేనే చెప్పానని అంటాడు. ఆ తర్వాత కన్న తండ్రి అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు శ్రీనివాస్ ని తిడతాడు. ఆ తర్వాత పోలీసులు తీసుకొని వెళ్తారు. మరోక వైపు కృష్ణకి టీ తీసుకొని శకుంతల వస్తుంది. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానా అని కృష్ణ అడుగుతుంది. నేను మా ఇంటికి వెళ్లి ఏసీపీ సర్ గురించి అడుగుతానని శకుంతలకి కృష్ణ చెప్తుంది. శకుంతల వద్దని చెప్పిన కృష్ణ వినకుండా భవాని దగ్గరికి బయలుదేర్తుంది. మరొక వైపు ప్రభాకర్ హాస్పిటల్ కి వచ్చి కృష్ణ ఎక్కడ అని అడుగుతాడు. భవాని దగ్గరికి వెళ్లి ఏసీపీ గురించి అడుగుతానంటూ వెళ్ళిందని శకుంతల చెప్పగానే.. ఎందుకు పంపించావని తనపై ప్రభాకర్ కోప్పడతాడు.  ఆ తర్వాత కృష్ణని తన ఇంటికి వెళ్లకుండా ఆపాలని అక్కడ నుండి వెళ్తాడు.

మరొక వైపు డాక్టర్స్ మురారి సర్జరికీ సంబందించి ఏ విషయం బయటకు రావద్దని అనుకుంటారు. మరొక వైపు మురారి కర్మకాండ జరిపించాలని పంతులిని తీసుకొని వస్తాడు మధు. ఏర్పాట్ల గురించి రేవతికి చెప్తాడు. మరొక వైపు కృష్ణ ఇంటిముందుకు రాగానే ప్రభాకర్ తన వెనకాలే వచ్చి వెనక్కి తీసుకొని వెళ్తాడు. కృష్ణ, ప్రభాకర్ లు వెళ్లడం ముకుంద చూస్తుంది. మరొకవైపు కృష్ణ, ప్రభాకర్ లు  హాస్పిటల్ కి వెళ్లి మురారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.