English | Telugu

తాగిన మైకంలో ఒకే బెడ్ పై వాళ్ళిద్దరు!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-901 లో.. శైలేంద్ర కుట్రల గురించి ఎలాగైన రిషికి సాక్షాలతో చూపించాలని వసుధార, మహేంద్ర అనుకుంటూ ఉండగా అప్పుడే వచ్చిన రిషి.. ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారని అడుగుతాడు. వసుధార, మహేంద్ర ఏదో ఒకటి కవర్ చేస్తారు.

ఆ తర్వాత నేను జగతి ప్రాణo కంటే ఎక్కువగా ప్రేమించుకున్నాం కానీ ఇప్పుడు మాకు కలిసి ఉండే అదృష్టం లేకుండాపోయింది. మీరు నాలాగా కాకూడదు ఎప్పుడు కలిసి మెలిసి ఉండాలని మహేంద్ర అంటాడు. మీకు ఆ పరిస్థితి రావడానికి కారణం నేనే కదా అని మహేంద్రకు రిషి సారీ చెప్తాడు. అలా అనకు రిషి, ప్రశాంతత కోసం అని వచ్చి మీరు అప్సెట్ అయితే ఎలా ఒక ప్లేస్ కీ తీసుకొని వెళ్తాను పదా అని రిసార్ట్ ముందు నృత్యం చేస్తున్న వారి దగ్గరికి మహేంద్ర తీసుకొని వస్తాడు. ఆ తర్వాత వాళ్ళతో పాటు రిషి, వసుధార, మహేంద్ర ముగ్గురు కలిసి డ్యాన్స్ చేస్తారు. ఆ తర్వాత మహేంద్ర పక్కకి వచ్చి కూర్చొని వాటర్ బాటిల్ లో మందు కలుపుతాడు. అది తెలియని వసుధార, రిషి డాన్స్ చేసి వచ్చి మహేంద్ర మందు కలిపిన వాటర్ తాగుతారు. అప్పుడే మహేంద్ర వచ్చి ఈ వాటర్ ఎందుకు తాగారని అడుగుతాడు. ఇక వసుధార, రిషి మందు మైకంలో ఉంటారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఒక పాట మైకంలో డ్యాన్స్ చేస్తుటారు. వాళ్ళను అలా చూసిన మహేంద్ర హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు.

ఆ తర్వాత రిషి, వసుధారలని మహేంద్ర లోపలికి తీసుకొని వెళ్తాడు. మరుసటి రోజు ఉదయం రిషి, వసుధారలు నిద్రనుండి లేచేసరికి ఇద్దరు ఒకే బెడ్ పై ఉండడం చూసుకొని రాత్రి డాన్స్ చేసింది గుర్తుకు చేసుకుంటూ నవ్వుకుంటారు. ఆ తర్వాత రిషికి వసుధార కాఫీ ఇస్తుంది. మహేంద్ర ఎక్కడ కన్పించకపోయేసరికి రిషి, వసుధారలు వెతుకుతారు. మహేంద్ర డ్రింక్ చేస్తు వెళ్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.