English | Telugu

పుట్టుమచ్చ ఆధారంగా హీరోని కనిపెట్టిన హీరోయిన్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -298లో.. ప్రభాకర్ శకుంతలతో కృష్ణకి మురారి లేడన్న విషయం చెప్తానని అంటుండగా అప్పుడే కృష్ణ వచ్చి.. వాళ్ళ మాటలు వింటుంది. "ఏం మాట్లాడుతున్నావ్ చిన్నాన" అని కృష్ణ అడుగుతుంది. ఆ తర్వాత ప్రభాకర్ జరిగిందంత కృష్ణకి చెప్తాడు. కృష్ణ ఎమోషనల్ అవుతు.. మీరు చెప్పేది నిజం కాదు. నేను అసలు నిజమేంటో తెలుసుకుంటానని కృష్ణ అనుకుంటుంది.

మరొక వైపు రూపం మారిన మురారి తల పట్టుకొని గతం గుర్తుకుతెచ్చుకున్నట్లు బెహేవ్ చేసేసరికి.. డాక్టర్స్ వచ్చి మురారికి ఇంజక్షన్ వెయ్యాలని ట్రై చేస్తుంటారు. అప్పుడే కృష్ణ వస్తుంది. కృష్ణ రావడం చూసిన మురారి సైలెంట్ అయిపోతాడు. అప్పుడే పరిమళ మేడమ్ వస్తుంది. ఆ తర్వాత కృష్ణ, పరిమళ మేడమ్ పక్కకి వెళ్లి మాట్లాడుకుంటారు. కృష్ణ జరిగిందంత పరిమళకి చెప్తుంది. ఇద్దరు కాసేపు జరిగిన సంఘటన గురించి మాట్లాడుకున్న తర్వాత ప్లాస్టిక్ సర్జరి చేసింది మురారికే అనిపిస్తుందని అంటుంది. అప్పుడు ముకుంద వాళ్ళ అన్నయ్య మొదటగా మురారి అని చెప్పి,ఆ తర్వాత మురళి అని చెప్పాడు. నాకు ఇతనే మురారి అనిపిస్తుందని సర్జరి చేసేటప్పుడు తీసిన ఫొటోస్ కృష్ణకి పరిమళ చూపిస్తుంది. ఇతను నా ఏసీపీ సర్ అని కృష్ణ చెప్తుంది. మురారికి ఒక పుట్టు మచ్చ ఉండేది. కాలేజీ డేస్ లో కామెంట్స్ చేసేవాళ్ళం. అది కాలికి ఉంటుంది. ఇప్పుడు ఆ పుట్టు మచ్చ అతనికి ఉందో లేదో చూడాలని ఇద్దరు అనుకొని మురారి దగ్గరికి వెళ్తారు. మురారికి ఇంజక్షన్ చేసిన తర్వాత కృష్ణ కాలికి పుట్టుమచ్చ చూస్తుంది. అతనికి పుట్టుమచ్చ నిజంగానే ఉంటుంది. అది చూసి అతనే మురారి అని కన్ఫమ్ అయి కృష్ణ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత కృష్ణ తన చిన్నాన్న దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తుంది. ఏసీపీ సర్ బ్రతికే ఉన్నాడు. కావాలంటే పరిమళ మేడమ్ అని అడగండి మీకు మొత్తం చెప్తారని కృష్ణ వాళ్ళని పరిమళ మేడమ్ దగ్గరికి తీసుకొని వెళ్తుంది.

మరొక వైపు భవాని మురారి గురించి ఆలోచిస్తుంటుంది. అప్పుడే ముకుంద వచ్చి మురారి ఫొటోకి ఉన్న దండ తీసేస్తుంది. భవాని కోపంగా ఏం చేస్తున్నావని ముకుందని అడుగుతుంది. మురారి బ్రతికే ఉన్నాడు. కృష్ణ వాళ్ళ చిన్నాన్న తో కలిసి ఇదంతా చేసిందని ముకుంద చెప్పగానే అందరు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.