English | Telugu
కారు ప్రమాదం నుండి అనుపమ అతడిని కాపాడింది!
Updated : Oct 27, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -904 లో.. వసుధార పడుకొని ఉంటుంది. అప్పుడే రిషి కాఫీ తీసుకొని వచ్చి కర్టెన్ తీస్తాడు. అప్పుడే వసుధార నిద్రలేస్తుంది. రిషి కాఫీ తీసుకొని వెళ్లి వసుధారకి ఇవ్వగానే మీరు తెచ్చారు ఏంటని అడుగుతుంది. నీ కోసం స్పెషల్ గా తయారు చేయించానని రిషి అంటాడు. ఆ తర్వాత వసుధార కాఫీ తీసుకొని సాసర్ లో కాఫీ పోసి రిషికి ఇస్తుంది.
మరొక వైపు రిషి వాళ్ళు ఎక్కడికి వెళ్లారని శైలేంద్ర ఆలోచిస్తుంటాడు. అప్పుడే శైలేంద్ర దగ్గరకి దేవయాని వస్తుంది. శైలేంద్ర ధరణి ఫోన్ పట్టుకొని ఈ ఒక్క ఆయుధం ద్వారా రిషి వాళ్ళు ఎక్కడ ఉన్నారని తెలుసుకోవచ్చని దేవయానితో చెప్తాడు. ఆ తర్వాత ధరణిని శైలేంద్ర పిలిచి నా ఫోన్ సరిగా పని చెయ్యడం లేదు. నీ ఫోన్ లాక్ తీసి ఇవ్వు మెయిల్ పంపించాలని శైలేంద్ర అనగానే ధరణి లాక్ తీసి ఇస్తుంది. ఆ తర్వాత శైలేంద్ర ధరణి మెసేజ్ చేసినట్లుగా వసుధారకి మెసేజ్ చేస్తాడు. ఎక్కడ ఉన్నారని ధరణి ఫోన్ నుండి శైలేంద్ర మెసేజ్ చేస్తాడు. అప్పటికే వసుధారకి ధరణి కాకుండా శైలేంద్రే మెసేజ్ చేస్తున్నాడని అర్ధం అవుతుంది. దాంతో వసుధార లొకేషన్ ని ఫొటో తీసి పంపిస్తుంది. వసుధార ఆలా పంపగానే ఈ లొకేషన్ ఎక్కడ అని తనకి తెలిసిపోతుంది. ఆ తర్వాత ఎందుకు ఇలా చేస్తున్నారని శైలేంద్రతో ధరణి అంటుంది. మరొక వైపు డాడ్ ఇలా ఎందుకు బెహేవ్ చేస్తున్నారు. అసలు ఆ అనుపమ ఎవరు మొన్న డాడ్ వెళ్లిన ప్లేస్ కి వెళ్తే ఏదైనా క్లూ దొరుకుతుందని వసుధారతో రిషి చెప్పి వెళ్తాడు. మరొక వైపు రిషికి ఏమైనా నా గురించి డౌట్ వచ్చిందా అని రిషిని మహేంద్ర ఫాలో అవుతు వెళ్తాడు. మరొక వైపు అనుపమ కూడా మొన్నటి ప్లేస్ కి మహేంద్ర వస్తడేమో అని అనుపమ బయలుదేరి వెళ్తుంది.
మరొక వైపు రిషి బయటకు రావడం శైలేంద్ర మనిషి చుసి శైలేంద్రకి ఫోన్ చేసి చెప్పగానే.. ఈ రోజు వాడిని వదిలిపెట్టకని చెప్తాడు. మరొకవైపు రిషి వెళ్తుంటే మహేంద్ర ఫాలో అవుతు వస్తుంటాడు. సడన్ గా దారిలో రిషిని మిస్ అవుతాడు మహేంద్ర. మరొక వైపు అనుపమ కార్ ఆగిపోవడంతో అనుపమ కార్ నుండి దిగి బయట నిల్చొని ఉంటుంది. మరొక వైపు రిషి నడుచుకుంటూ వెళ్తుంటే.. శైలేంద్ర మనిషి కార్ తో డాష్ ఇవ్వడానికి వస్తుంటాడు. అది చూసిన అనుపమ ఒక్కసారిగా రిషిని పక్కకి లాగుతుంది. ఏం ఆలోచిస్తున్నవ్ అంటు రిషిని అనుపమ అడుగుతుంది. నీ శత్రువులు అయి ఉంటారు కావాలనే వాళ్ళు అలా చేసినట్టు అనిపించిందని అనుపమ అంటుంది. నడుచుకుంటూ వెళ్తారా? వద్దు నేను నా కార్ లో డ్రాప్ చేస్తానని రిషిని అనుపమ తీసుకొని వెళ్తుంది. మరొక వైపు రిషిని మిస్ అయి తిరిగి రిసార్ట్ కి వస్తాడు మహేంద్ర. అప్పుడే అనుపమతో రిషి రావడం చూసిన మహేంద్ర షాక్ అవుతాడు. మరొకవైపు ఇది మహేంద్ర ఉండే రెసార్ట్ కదా.. మహేంద్ర గురించి ఇతడిని అడగాల అని అనుపమ అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.