English | Telugu

వాళ్ళిద్దరు కలిసి ఉన్న ఫోటోలని డిలీట్ చేసింది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -237 లో.. కావ్యని బెడ్ పై పడుకోమని చెప్పిన రాజ్... ఇంకా మూడు నెలలు టైం ఉంది కదా నిన్ను భార్యగా ఆక్సెప్ట్ చెయ్యడానికి అని అంటాడు. మూడు నెలలు కాదు రెండు నెలలే అని కావ్య అంటుంది. ఆ తర్వాత కావ్య ఫోన్ లో పాటలు పెట్టుకొని వింటు ఉంటుంది. రాజ్ నిద్ర డిస్టబెన్స్ అవుతాడు. కావ్య దగ్గరగా వెళ్లి సాంగ్స్ అఫ్ చెయ్యాలని అనుకుంటాడు రాజ్.

ఆ తర్వాత రాజ్ సాంగ్స్ చెయ్యబోతుండగా కావ్య ఒక్కసారిగా లేచి.. ఏం చేస్తున్నారు అంటూ సిగ్గుపడుతుంది. నేను సాంగ్స్ అఫ్ చెయ్యాలని వచ్చానని రాజ్ అంటాడు. నువ్వు పాటలు అఫ్ చేసి పడుకోమని కావ్యతో రాజ్ చెప్తాడు. మరొకవైపు కళ్యాణ్, అనామిక ఇద్దరు క్లోజ్ గా ఉండడం అప్పు గుర్తుకు చేసుకొని బాధపడుతుంది.. అప్పుడే కళ్యాణ్ ఫోన్ చేసి.. నేను అనామిక దిగిన ఫొటోస్ పంపిస్తున్నాను. అందులో బెస్ట్ ది సెలక్ట్ చెయ్. అది ఫ్రేమ్ చేసి అనామికకి ఇస్తానని కళ్యాణ్ అంటాడు. అప్పు చిరాకుగా నేను చెయ్యనని మొదట చెప్పినా ఆ తర్వాత ఒప్పుకుంటుంది. కాసేపటికి కళ్యాణ్ పంపించిన ఫొటోస్ అని అప్పు డిలీట్ చేస్తుంది. ఆ తర్వాత అన్నపూర్ణ అప్పు దగ్గరికి వచ్చి ఫొటోస్ కాదు.. నీ మనసులో అతని ఆలోచనలు డిలీట్ చెయ్ అని చెప్తుంది.

మరొక వైపు స్వప్నకి శ్రీమంతం చెయ్యాలని దుగ్గిరాల ఫ్యామిలీ అనుకుంటుంది. స్వప్నకి శ్రీమంతం చేసి తీసుకొని వెళ్ళిపోతే.. ఆ తర్వాత నేనేమీ చెయ్యలేనని రుద్రాణి అనుకుంటుంది. అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. శ్రీమంతం గ్రాంఢ్ గా చెయ్యాలని రాజ్ అంటాడు.. ఆ తర్వాత కావ్యని శ్రీమంతం ఎలా చేద్దామని అడుగుతారు. కావ్య వద్దని చెప్పేలోపు.. నీతో పని ఉందంటు కావ్యని స్వప్న లాక్కొని తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత ఇంతమందిని మోసం చేస్తున్నావ్ అని స్వప్నని కావ్య తిడుతుంది.. ఈ ఒక్కసారి వదిలేయ్ శ్రీమంతం తర్వాత ఇంటికి వెళ్తాను కదా అక్కడకి వెళ్ళాక అబార్షన్ అయిందని చెప్తానని కావ్యని నిజం చెప్పకుండా స్వప్న ఆపుతుంది. మరొక వైపు ఇంట్లో శ్రీమంతం చేస్తున్నందుకు అందరు చాలా హ్యాపీగా ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.