English | Telugu

యూట్యూబ్ ట్రెండింగ్ లో కృష్ణ ముకుంద మురారి సీరియల్!

యూట్యూబ్ లో సీరియల్స్ ప్రోమోలు రెగ్యులర్ గా రిలీజ్ అవుతుంటాయి. అయితే ఒక్కోరోజు ఒక్కో సీరియల్ ఇందులో ట్రెండింగ్ లో ఉంటాయి‌.‌ ఈ రోజు మాత్రంస్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న ' కృష్ణ ముకుంద మురారి ' సీరియల్ ఫుల్ ట్రెండింగ్ లో సాగుతోంది. అంతాలా ఏం ఉందో ఓసారి చూసేద్దాం.

కృష్ణ కడుపులో బిడ్డని మీరా అలియాస్ ముకుంద విషమిచ్చి చంపేసిన సంగతి తెలిసిందే. అయితే అదే సమయంలో సరోగసి ద్వారా బిడ్డల్ని కనొచ్చని కృష్ణ, మురారీలకి ఓ ఐడియాని ఇచ్చింది ముకుంద‌. దాంతో వైదేహీ అనే డాక్టర్ ద్వారా కృష్ణ, మురారీలు సరోగసీ ప్లాన్ చేస్తారు. అయితే సరోగసి తల్లిగా మీరా అలియాస్ ముకుంద ఉందని తర్వాత తెలుసుకుంటారు. దాంతో తనేం చేసిన కృష్ణ, మురారీలు ఏం చేయలేని పరిస్థితులలో ఉన్నారు. ఇదే అదునుగా భావించిన మీరా తన డ్రామా మొదలెడతుంది. అదర్శ్ తో పెళ్ళి క్యాన్సిల్ అవ్వాలని తను ప్రెగ్నెంట్ అని అందరికి తెలిసేలా చేస్తుంది. ఇక కృష్ణ ప్రెగ్నెంట్ కాదనే నిజాన్ని కూడా భవాని కంటపడేలా చేస్తుంది మీరా. మరోవైపు మీరా ప్రెగ్నెంట్ అనే నిజం తెలిసిన నుండి మురారి కనపడకుండా పోతాడు. అదే సమయంలో ఇంట్లోని వారందరికి తన కడుపులో పెరుగుతున్న బిడ్డ మురారి బిడ్డే అని.. ఇంటి వారసుడని, డీఎన్‌ఏ కి సిద్ధంగా ఉన్నానంటూ స్టేట్ మెంట్ ఇస్తుంది మీరా. దాంతో అందరు ఆశ్చర్యపోతారు.

ఇక మీరా గురించి భవాని ఎంక్వైరీ చేస్తుంది. ఎందుకు కృష్ణ మీద నమ్మకం లేదా అని భవానిని మధు అడుగుతాడు. అలా కాదని తను నిజంగానే అనాధేనా, డ్రామా చేస్తుందా తెలుసుకోవాలని వెళ్ళానని భవాని చెప్తుంది. ఇక నేటి ప్రోమోలో మీరా అలియాస్ ముకుందని ఫాలో అవుతూ కృష్ణ, మధు వెళ్తారు. ఇక అక్కడ ఇంట్లో మురారి గాయాలతో ఉండగా.‌ అతడిని చూసిన కృష్ణ ఎమోషనల్ అవుతుంది. అదే సమయంలో అక్కడ మీరా ఉండటం చూసి .. తన వంక కోపంగా చూస్తుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు క్యూరియాసిటిని పెంచేసింది. ఏం జరుగిందో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే.