English | Telugu

Krishna Mukunda Murari : పండంటి బిడ్డకు జన్మనిస్తానంటూ మాటిచ్చిన కోడలు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -447 లో... అక్కా.. ఆదర్శ్ పెళ్లి విషయం ఏం ఆలోచించారు? సంగీత గురించి ఏదైనా నిర్ణయం తీసుకున్నారా అని భవానిని రేవతి అడుగగా.. ఆదర్శ్‌ని నేను కనకపోయినా, నాకు వారసుడు ఇస్తాడనుకున్నాను. కానీ నేను ఊహించినట్లు వాడి జీవితం ఎప్పుడూ లేదు. చూద్దాం. ప్రస్తుతానికి బాగానే ఉన్నాడు కదా.. ఆలోచిద్దాం. ఇక మీదట నా ఆశలన్నీ మురారీ, కృష్ణల మీదే అని అంటుంది. ఇంతలో మురారీ, కృష్ణలు కిందకు దిగి వస్తారు. వెంటనే భవాని లేచి నిలబడి కృష్ణతో మాట్లాడుతుంది. నాకు మనవడో, మనవరాలో కావాలి.. ఎప్పుడిస్తావ్ తింగరి.. నాకు త్వరలోనే వారసుడ్ని ఇస్తానని మాటిస్తావా అంటూ ప్రేమగా భవాని మాట్లాడుతుంది. అదంతా మీరా పైనుండి కోపంగా చూస్తుంటుంది.

మాటిస్తున్నా అత్తయ్యా.. వచ్చే జనవరి కల్లా పండంటి బిడ్డను మీ చేతుల్లో పెడతానని కృష్ణ అంటుంది. ఇంతలో మధు అక్కడికి వచ్చి.. అబ్బా సూపర్ సీన్.. ఓ ఫొటో తీస్తాను అలానే ఉండండి అంటాడు. ఏరా మధు.. కృష్ణ మాట తప్పుతుందని అనుకుంటున్నావా? రేపు ఫొటో చూపించి అడగటానికి సాక్ష్యంగా ఇప్పుడు ఫొటో తీస్తాను అంటున్నావా అని మురారి నవ్వుతాడు. ఏంటి నన్ను ఇరికిస్తున్నారు? మీరు కూడా మాటివ్వండి అంటూ భర్త చేతిని భవానీ చేతిలో పెట్టి.. తన చేతిని పైన వేసి కృష్ణ నిలబడుతుంది. ఇప్పుడు ఫ్రేమ్ అదిరిపోయింది అంటూ మధు ఫొటోలు కొడతాడు. మురారీ, కృష్ణలు వారసుల్ని ఇస్తానని మాటివ్వడంతో భవాని పొంగిపోతుంది.

ఇక పైనుంచి మీరా చూస్తూ. ఇద్దరూ ఒక్కటైపోయారు కదా అని ఎంతో ధైర్యంగా మాట ఇచ్చేస్తున్నావే కృష్ణా.. పిల్లల్ని కనడం కాదు కదా.. నీ కడుపున బిడ్డ పడిందన్న సంతోషాన్ని కూడా మిగలనివ్వను. మురారీకి పిల్లంటూ కలిగితే అది నాతోనే.. ఇది ఎవ్వరూ మార్చలేరని మీరా రగిలిపోతుంది. మరోవైపు డాక్టర్ వైదేహినీ ముకుంద కలుస్తుంది. ఇక్కడ నన్ను అరగంట నుంచి వెయిట్ చేయించావని వైదేహీ అనగానే.. సారీ.. నా పరిస్థితి తెలుసు కదా.. ఎవరికి అనుమానం రాకుండా వచ్చేసరికి ఇంత టైమ్ అయ్యిందని మీరా అంటుంది. అదేందో ఆసుపత్రికే రావచ్చు కదా అని వైదేహీ అనగానే.. ‘నేను ఏమైనా ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నానా? అఫీషియల్‌గా కలవడానికి? నేను నా లైఫ్‌కి చేసుకుంటున్న ట్రీట్‌మెంట్.. ఎవరికి తెలియకుండా రహస్యంగా జరగాల్సిందని, అందుకే నీకు కొంచెం ఇబ్బంది కలిగించేదైనా ఇలా రహస్యంగా కలవాల్సి వస్తోందని మీరా అంటుంది. ఎవరికీ తెలియకుండా చేస్తున్నావంటే.. అది తప్పు అని నీకు తెలుసు. అయిన చెయ్యాలి అనుకుంటున్నావా అని వైదేహీ అంటుంది. తప్పు కాదు.. అయిన చేయవా అని మీరా అనేసరికి.. చేయకూడదనుకుంటే ఇంత దూరం ఎందుకు వస్తాను? ఇలా మళ్లీమళ్లీ కలవడం దేనికీ అనేదే నా బాధ అని వైదేహి అంటుంది.

రేపు ఏదైనా సమస్య వస్తే నాతో పాటు నువ్వు కూడా దొరికిపోతావ్ అన్న భయమా? నీకు ఆ భయం అక్కర్లేదు.. నేను అనుకున్నది జరగడం కోసం.. నా రూపం, నా గొంతు.. ఇలా అన్నీ మార్చుకున్నాను.. నా అంతట నేను చెబితే తప్ప.. నా గురించి నువ్వు చెబితే తప్పా.. ఎవరికీ తెలిసే ఛాన్సే లేదని మీరా అంటుంది. సరే ఇప్పుడు ఎందుకు కలవమన్నావో చెప్పమని వైదేహీ అంటుంది. నీకు ఆల్రెడీ చెప్పాను కదా.. కృష్ణ ఎట్టిపరిస్థుతుల్లోనూ తల్లి కాకూడదంటూ ఏదో ప్లాన్ చెబుతుంది. ఆమె వింటూ ఉంటుంది. అర్థమైంది కదా.. ఆ కృష్ణ మాత్రం తల్లి కాకూడదని అనేసి కారులో మీరా తిరిగి వెళ్లిపోతుంది. ఇక మరోవైపు మీరా కనపడటం లేదని అదర్శ్ చెప్తుంటాడు. అప్పుడే మీరా వచ్చి.. ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళానని చెప్తుంది. ఇంతలో మురారీ, కృష్ణలు కూడా అప్పుడే కిందకు వస్తారు. ఆదర్శ్, మీరా మాటలు విని అర్థం చేసుకున్న మురారీ. నువ్వు వెళ్లావని కాదు వీడి బాధ.. వాడ్ని తీసుకెళ్లలేదని బాధ అని మీరాతో మురారి అంటాడు. మీరాతో. రజినీ రగిలిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.