English | Telugu

జబర్దస్త్ లో కుళ్ళు రాజకీయాలు.. వాళ్ళ బాగోతం బయటపెట్టిన నూకరాజు!

ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా బుల్లితెరపై అయినా, వెండితెరపై అయినా రాణించడం అంత తేలిక కాదు. అవకాశాలు రాకపోగా, ఎన్నో అవమానాలు ఎదురవుతాయి. జబర్దస్త్ కమెడియన్ నూకరాజుకి కూడా కెరీర్ లో స్టార్టింగ్ లో అలాంటి అనుమానాలే ఎదురయ్యారట.

జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్స్ ఎందరో ఉన్నారు. వారిలో నూకరాజు ఒకడు. కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి, తనదైన కామెడీ టైమింగ్ తో అందరినీ మెప్పించి.. టీం లీడర్ స్థాయికి ఎదిగాడు. అయితే దీని వెనుక నూకరాజు పడిన కష్టం ఎంతో ఉంది. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. కెరీర్ స్టార్టింగ్ లో జబర్దస్త్ లో జరుగుతున్న కుళ్ళు రాజకీయాలను భరించలేకపోయాడట. ఈ విషయాలను స్వయంగా నూకరాజే రివీల్ చేశాడు.

తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నూకరాజు మాట్లాడుతూ, జబర్దస్త్ షో గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. జబర్దస్త్ కు వచ్చిన కొత్తలో కుళ్ళు రాజకీయాలను భరించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. టీం లీడర్లు, సీనియర్లు కలిసి కుళ్ళు రాజకీయాలు చేసేవారని.. టాలెంట్ ఉన్నవాళ్ళని పట్టించుకోకుండా, అసలు డైలాగ్ కూడా చెప్పలేని వాళ్ళని హైలైట్ చేసేవారని చెప్పుకొచ్చాడు. ఇలా చేయడం తప్పని ప్రశ్నించినందుకు.. నన్ను ప్రోమోలలో కనిపించకుండా చేయడమే కాకుండా.. కొన్ని ఎపిసోడ్స్ నుంచి కూడా పూర్తిగా తొలగించారని చెప్పాడు. ఆ సమయంలో మానసికంగా ఎంతో వేదనని అనుభవించినట్లు తెలిపాడు. అయితే తనని తన రైటింగే కాపాడిందని, అదే తనని ఇప్పుడు జబర్దస్త్ లో ఉండేలా చేసిందని నూకరాజు చెప్పుకొచ్చాడు.

జబర్దస్త్ లో జరిగే కుళ్ళు రాజకీయాల గురించి నూకరాజు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.