English | Telugu

Karthika Deepam2 : మల్లేశ్ ఇంట్లో పనిమనిషిలా అనసూయ.. భయపడిన శౌర్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'... ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -21 లో... దీప అన్న మాటలు పారిజాతం గుర్తుకుచేసుకుని దాన్ని ఎలా వదిలించుకోవాలని ఆలోచిస్తుంది. అప్పుడే బంటు వెళ్తుంటే.. పారిజాతం అతన్ని పిలుస్తుంది. ఇప్పుడే ఆ దీపని బయపెట్టి వచ్చాను.. పాపం బాగా బయపడిందని బంటు బిల్డప్ ఇస్తుంటాడు. నువ్వు దాన్ని బయపెట్టావా అంటు పారిజాతం వెటకారంగా మాట్లాడుతుంది. ముందు దాన్ని ఇంట్లో నుండి బయటకు పంపంచే ఐడియా చూడని బంటూతో పారిజాతం అంటుంది. ఆ తర్వాత మీ పెదాలపై చిరునవ్వు చూడడానికి ఈ బంటు ఏదైనా చేస్తాడని అంటాడు.

ఆ తర్వాత జ్యోత్స్న, కార్తీక్ ఇద్దరు షాపింగ్ కి వెళ్తుంటే.. కార్ దగ్గర సన్ రూఫ్ ని చూస్తుంటుంది శౌర్య. " కార్తీక్..మీతో పాటు నేను కూడా వస్తా‌ను " అని శౌర్య అనగానే.. సరే అని అంటారు. వెళ్లి అమ్మతో చెప్పి రమ్మని కార్తీక్ అనగానే.. మాకు గొడవ అయింది. నువ్వు వెళ్లి చెప్పిరా అని కార్తీక్ ని దీప దగ్గరికి శౌర్య పంపిస్తుంది. ఆ తర్వాత శౌర్యని బయటకు తీసుకొని వెళ్తానని కార్తీక్ చెప్పగానే.. మొదట వద్దని చెప్పినా ఆ తర్వాత తీసుకొని వెళ్ళండి.. తనకి ఏం కొనివ్వకండి అని దీప చెప్తుంది. ఆ తర్వాత నిన్ను మాతో తీసుకొని వెళ్లాడానికి మీ అమ్మ ఒప్పుకుందని శౌర్యని తీసుకొని కార్తిక్ , జ్యోత్స్న లు వెళ్తారు. శౌర్య కార్ కి గల సన్ రూఫ్ నుండి పైకి చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు అనసూయేమో మల్లేశ్ వాళ్ళింట్లో పనులు చేస్తుంటుంది. నువ్వు ఇక్కడ పని చెయ్యకపోతే.. ఈ ఇల్లు ఈ రోజే వేలం వేస్తానని అనసూయని మల్లేశ్ బెదిరిస్తాడు. నా కోడలు ఇంకా రాలేదు కనీసం ఫోన్ కూడా చెయ్యలేదని అనసూయ అనుకుంటుంది.

మరొకవైపు శౌర్య షాపింగ్ మాల్ కు వెళ్లి.. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తనకి నచ్చిన డ్రెస్ ని కార్తీక్ కొనిస్తాడు. అమ్మ ఏమైనా అంటుందేమోనని శౌర్య భయపడుతుంటే.. నేను చూసుకుంటానని కార్తీక్ చెప్తాడు. ఆ తర్వాత శౌర్య డ్రెస్ లు చూస్తుంటే అప్పుడే నర్సింహా రెండో భార్య శౌర్యని చూసి.. దీప, నరసింహ మాట్లాడుకున్న మాటలు గుర్తుకు చేసుకుంటుంది. నువ్వు ఆ రోజు మా ఇంటి దగ్గర పూలు కోసిన అమ్మాయివే కదా అని ఆవిడ శౌర్యని అడుగుతుంది. శౌర్య అలాగే భయపడుతు చూస్తుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.