English | Telugu
గాయాలతో ఉన్న మురారిని కృష్ణ కాపాడుకోగలదా!
Updated : Aug 25, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -244 లో.. మురారితో ముకుంద కలిసి ఉన్న ఫోటోని ముకుంద అలా చూస్తూ ఉంటుంది. అప్పుడే ముకుంద దగ్గరికి నందు వచ్చి.. నీ గదిలో ఆదర్శ్ ఫోటో ఒక్కటి కూడా లేదు కదా అని అడుగుతుంది. ముకుంద సైలెంట్ గా ఉంటుంది. మురారి, ముకుంద కలిసి ఉన్న ఫోటోని నందు తీసుకొని ఒకే ఇంట్లో ప్రేమించిన అతను, పెళ్లి చేసుకున్న అతను ఉన్నాడు. నీకు ఇబ్బందిగా అనిపించడం లేదా అని నందు అడుగుతుంది. ఇబ్బంది కాదు బాధగా ఉందని ముకుంద సమాధానం చెప్తుంది.
ఆ తర్వాత నాకు ఒక హెల్ప్ చేస్తావా అని నందుని ముకుంద అడుగుతుంది. ఏంటని నందు అడుగగా.. మా ఇద్దరి ప్రేమ సంగతి పెద్దత్తయ్యకి చెప్తావా అని ముకుంద అడుగుతుంది. నేను చెప్పలేనని నందు అంటుంది. కృష్ణ మురారిన ఒకటి చేద్దామని నేను అనుకుంటే ముకుంద తనని మురారిని ఒకటి చెయ్యమని చెప్తుందేంటని నందు అనుకుంటుంది. మరొక వైపు కృష్ణ పేటెంట్స్ కి ట్రీట్మెంట్ ఇస్తుంటుంది. తనకి దూరంగా మురారి బట్టలు ఆరెస్తూ కన్పిస్తాడు. అది చుసిన కృష్ణ ఇంట్లో ఎలా ఉండేవారు.. ఇప్పుడు ఎలా అయిపోయారనుకోని మురారి దగ్గరికి కృష్ణ వెళ్లి.. తను ఆరేస్తున్న బట్టలు తీసుకొని మురారిని దబాయిస్తూ కృష్ణ ఆరేస్తుంది. మీరు ముందు ఆ ఎక్స్ పోసింగ్ ఆపండి. వెళ్లి షర్ట్ వేసుకొని రండి అని మురారిని కృష్ణ పంపిస్తుంది.
ఆ తర్వాత కృష్ణ, మురారి ఇద్దరు మాట్లాడుకుంటుండగా క్యాంపు ఉన్న దగ్గర మంటలు అంటుకుంటాయి. అది చూసిన మురారి పరుగున వెళ్లి అందులో ఉన్న చిన్న పిల్లలను కాపాడతాడు. ఏసీపీ సర్ అంటూ కృష్ణ అరుస్తూ ఉంటుంది.. అందరిని మురారి కాపాడతాడు. చివరగా లోపల ఒక పిల్లాడు ఉంటాడు. అతనికోసం లోపలికి వెళ్లి తీసుకొని వచ్చేటప్పుడు మురారి గాయాలు అవుతాయి. ఒక్కసారిగా మురారి కిందపడిపోతాడు. మురారిని చూసి కృష్ణ ఏడుస్తుంటుంది. వేరొక డాక్టర్ వచ్చి మురారికి ట్రీట్మెంట్ ఇస్తాడు. మురారి కండిషన్ బాలేదని డాక్టర్ చెప్పగానే.. కృష్ణ ఏడుస్తూ నా భర్తని నేను కాపాడుకుంటానని కృష్ణ ట్రీట్మెంట్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.