English | Telugu
రిషికి తనపై మళ్ళీ మొదలైన ప్రేమ!
Updated : Aug 24, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -850 లో.. జగతి, మహేంద్ర ఇద్దరు కాలేజీ వర్క్ చేస్తుంటే చుసిన శైలేంద్ర.. కావాలనే ఫణింద్ర ముందు రాత్రంతా పిన్ని బాబాయ్ ఇద్దరే కాలేజీ వర్క్స్ చేస్తూ ఇబ్బంది పడుతున్నారని శైలేoద్ర అంటాడు. అవునా జగతి అలా మేరే కష్టపడడం దేనికి.. శైలేంద్రకి కూడా కొన్ని పనులు అప్పజెప్పవచ్చు కదా అని ఫణింద్ర అంటాడు.
ఆ తర్వాత నేనేదో ఒకసారి తప్పుగా మాట్లాడానని, పిన్ని బాబాయ్ లు నన్ను తప్పుగా అనుకుంటున్నారు. నాకు కాలేజీ వర్క్స్ చెప్పడం వాళ్లకి ఇష్టం లేదని శైలేంద్ర కన్నింగ్ గా మాట్లాడుతాడు. మీరు కొన్ని పనులు చెప్తేనే కదా ఎలా చేస్తున్నాడని తెలుస్తుందని ఫణింద్ర చెప్తాడు. సరే చెప్తాం తనకు కూడా తెలుసుకోవలిసినవి చాలానే ఉన్నాయ్.. మెల్లి మెల్లిగా నేర్పిస్తామంటూ జగతి చెప్తుంది. మరొక వైపు విశ్వనాథ్ హాల్లో కూర్చొని పేపర్ చదువుతుంటే రిషి వస్తాడు. రిషి కాఫీ తీసుకుంటాడు. వసుధారతో ఉన్నప్పుడు రిషి కాఫీ ఎలా సాసర్ లో పోసుకొని తాగేవాడో అలాగే వసుధారని గుర్తు చేసుకొని తాగుదామని అనుకుంటాడు. మళ్ళీ అలా రిషి తాగుతాడు. ఏంటి రిషి ఈ రోజు ఇలా చేస్తున్నాడని విశ్వనాథ్ అనుకుంటాడు. మరొక వైపు వసుధార కూడా చక్రపాణి ముందు రిషి మాదిరిగానే కాఫీని సాసర్ లో పోసుకొని తాగుతుంది. మరొక వైపు మహేంద్ర, జగతి ఇద్దరు కాలేజీకి వెళ్తూ దార్లో కాలేజీ గురించి మాట్లాడుకుంటారు. శైలేంద్ర మళ్ళీ ఏదో ప్లాన్ చేసినట్టు అర్థం అవుతుందని జగతి అంటుంది. మనం మిషన్ ఎడ్యుకేషన్ బాధ్యతలు రిషి వసుధారలకి ఇచ్చామని అందరికి చెబుదామని జగతి అంటుంది. లేదు ఇప్పుడు చెప్తే అన్నయ్యకి రిషి గురించి తెలిస్తుంది. ఆ తర్వాత తను వెళ్లి మాట్లాడితే మనపై రిషికి ఇంకా కోపం పెరుగుతుంది. రిషి పై పడ్డ మచ్చ పోగొట్టిన తర్వాత రిషి గురించి చెబుదామని మహేంద్ర అంటాడు.
మరొక వైపు రిషిలో మళ్ళీ వసుధారపై ప్రేమ కలుగుతుంది. వసుధార వచ్చి తనతో మాట్లాడినట్టు ఉహించుకుంటాడు రిషి. అప్పుడే రిషికి ఏంజిల్ కర్చీఫ్ తీసుకొని వచ్చి ఇస్తుంది. రిషి దాన్ని తీసుకొడు. ఇలాంటివన్ని కూడా నువ్వు నాకు ఇవ్వకూడదు. నీకు కాబోయే భర్తకి ఇవ్వాలని ఇండైరెక్ట్ గా చెప్తాడు రిషి. ఏంజిల్ అంటే రిషి కి ఇష్టం లేదని ఇండైరెక్ట్ గా చెప్తాడు. ఏంజెల్ కి మాత్రం దేని గురించి చెప్పాడో అర్థం కాదు. మరొక వైపు దేవయాని శైలేంద్రతో మాట్లాడుతుంది. ఏంటి ఆ జగతి, మహేంద్రల ముందు అంత తగ్గి మాట్లాడుతున్నావని శైలేంద్రని దేవయాని అడుగుతుంది. డాడ్ నా టార్గెట్.. తన ముందు అలా నటిస్తే చాలని శైలేంద్ర అంటాడు. నువ్వు కాలేజీ MD సీట్ లో కూర్చోవాలి అది నా కోరిక అని దేవయాని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.