English | Telugu

బిగ్ బాస్ హౌజ్ నుండి కిరణ్ రాథోడ్ అవుట్!

బిగ్ బాస్ సీజన్-7 లో అప్పుడే మొదటి వారం పూర్తయింది. ఇక ఉల్టా పల్టా థీమ్ లో కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయింది. " సీజన్-7 లో ప్రతీ కంటెస్టెంట్ యొక్క పర్ఫామెన్స్ ని హోస్ట్ గా నేను కూడా ఓట్ చేస్తుంటాను" అని నాగార్జున అన్నాడు. రేటింగ్ మీటర్ లో రెడ్ , ఆరెంజ్ , గ్రీన్ ఉంటుందని దాన్ని బట్టి మీ ఆటతీరుని నిర్ణయిస్తానని నాగార్జున అన్నాడు.

ఇక నామినేషన్స్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉండగా వారిలో ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ చివరికి ఇద్దరు మిగిలారు. వాళ్ళిద్దరు యావర్ , కిరణ్ రాథోడ్.. ఇద్దరురెడ్ అండ్ గ్రీన్ క్యూబ్స్ లో ఉంచారు నాగార్జున. ఇక కాసేపటికి కిరణ్ రాథోడ్ కి రెడ్ కలర్ రావడంతో తను ఎలిమినేట్ అయింది. అది చూసి హౌజ్ లోని అందరు భావోద్వేగానికి గురయ్యారు. కిరణ్ రాథోడ్ ని శోభా శెట్టి నామినేట్ చేసింది కాబట్టి తను ఇప్పుడు ఎలిమినేట్ అయిందని, అందుకే కిరణ్ రాథోడ్ వెళ్ళిపోతుందని శోభా శెట్టి ఏడ్చేసింది. అందరికి ఆల్ ది బెస్ట్ చెప్పేసి వెళ్లిపోయింది కిరణ్ రాథోడ్. ఆ తర్వాత అది చూసి దామిణి భావోద్వేగానికి గురైంది. " చాలా కష్టమమ్మా.. వన్ వీక్ లో బాగా కనెక్ట్ అయింది" అని కిరణ్ రాథోడ్ గురించి షకీలతో దామిణి చెప్తూ ఎమోషనల్ అయింది. ఇక నుండి గేమ్ ఆడాలని దామిణితో షకీల అంది. "ఆట సందీప్ స్ట్రాంగ్ కంటెస్టెంట్, కానీ రిజర్వు గా ఉంటున్నాడు. మీరు కూడా కాస్త రిజర్వ్ గా ఉంటున్నారు" అని అమర్ దీప్ తో గౌతమ్ కృష్ణ అన్నాడు.

ఇక ఎలిమినేట్ అయి హౌజ్ లో‌ని అందరికి గుడ్ బై చెప్పేసి హౌజ్ నుండి హోస్ట్ నాగార్జున దగ్గరికి వచ్చేసింది కిరణ్ రాథోడ్. అప్పుడు తన జర్నీ వీడీయోని నాగార్జున చూపింవాడు. అది చూసి కాస్త ఎమోషనల్ అయింది కిరణ్ రాథోడ్. "హౌజ్ లో ఎవరు ఉల్టా? ఎవరు సీదా" అని కిరణ్ రాథోడ్ ని నాగార్జున అడుగగా.. రతిక ఉల్టా అని కిరణ్ అంది. తనకి అటిట్యూడ్ ఉందని, అది తగ్గించుకోవాలని అందుకే ఉల్టా అని అంది. ఆ తర్వాత శోభా శెట్టి గురించి చెప్తూ.. తను సెల్ఫిష్ అని అందుకే తను ఉల్టా అని అంది. యావర్ సీదా అని, లవ్లీ పర్సన్ అని అంది. ప్రశాంత్.. ఉల్టా ఎందుకంటే అతనికి తనే విన్నర్ అనే ఓవర్ కాన్ఫిడెంట్ ఉందని అంది. రతిక.. ఉల్టా ఎందుకంటే తనతో‌ ఎక్కువ ఇంటారాక్ట్ అవలేదు. తనకి అటిట్యూడ్ ఉందేమో ఎవరితో ఎక్కువ కలవట్లేదు. తక్కువ నవ్వుతుందని అంది. టేస్టీ తేజ.. ఉల్టా. ఎందుకంటే చూడటానికి ఫన్నీగా కనిపించినా కాస్త కన్నింగ్ అని త‌న గేమ్ తను ఆడుతున్నాడని అంతా ఉల్టా అని అంది‌. షకీ అమ్మ.. స్వచ్ఛమైన గుణం ఉందని, మంచిదని తనకి దొరికిన బెస్ట్ ఫ్రెండ్ అని తన గురించి చెప్తూ ఎమోషనల్ అయింది.‌ షకీల కూడా తను అలా చెప్తుంటే కన్నీళ్ళు పెట్టుకుంది. ఇలా ఒక్కొక్కరి గురించి చెప్తూ ఎమోషనల్ అయింది కిరణ్ రాథోడ్. ఆ తర్వాత నాగార్జున ఎలిమినేషన్ అయిన కిరణ్ రాథోడ్ కి సెండాఫ్ ఇచ్చేశాడు. ఇలా మొదడి ఎలిమినేషన్ లో కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయింది.