English | Telugu
బిగ్ బాస్ బజ్ లో కిరణ్ రాథోడ్ సంచలన వాఖ్యలు!
Updated : Sep 12, 2023
తెలుగు టీవీ రంగంలో బిగ్ బాస్ ఒక సంచలనం సృష్టిస్తోంది. కాగా బిగ్ బాస్ సీజన్-7 ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. కాగా ఈ షోకి ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఆదరణ ఎక్కువైంది. సోమవారం జరిగిన నామినేషన్ల హీట్ మాములుగా లేదు. కాగా ఎలిమినేట్ అయి బయటకొచ్చిన కిరణ్ రాథోడ్ ఎగ్జిట్ ఇంటర్వ్యూ ప్రోమో తాజాగా విడుదలైంది.
ఎగ్జిట్ ఇంటర్వ్యూ చేసేది ఎవరో కాదు గీతు రాయల్. బిగ్ బాస్ సీజన్-6 లో తన మార్క్ స్ట్రాటజీతో కంటెస్టెంట్స్ కి చెమటలు పట్టించిన గీతు రాయల్ ఈ ఎగ్జిట్ ఇంటర్వూని చేసిందంటే, ఆ ఇంటర్వ్యూ ఏ రేంజ్ లో ఉంటుందో అందరికి తెలిసిందే. అయితే ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన వాఖ్యలు చేసింది కిరణ్ రాథోడ్. కాగా గీతు అడిగే ప్రశ్నలకు తడబడిపోయింది కిరణ్ రాథోడ్. దామిణి ఆడిన ఆటలో కిరణ్ రాథోడ్ కీలుబొమ్మనా అని గీతు రాయల్ అనగా.. అదేం లేదని చెప్పే ప్రయత్నం చేసింది కిరణ్ రాథోడ్. మరి గీతు ఆడిగిన కొన్ని ప్రశ్నలకు కిరణ్ రాథోడ్ సమాధానమిచ్చింది.
ఒక్కో కంటెస్టెంట్ గురించి కిరణ్ రాథోడ్ ని గీతు రాయల్ అడిగి తెలసుకుంది. మీరు ఇంత తొందరగా బయటకు రావడానికి కారణమేంటని గీతు రాయల్ అడుగగా.. ఐ థింక్ ఇట్ ఈజ్ టూ ఎర్లీ టూ డిసైడ్ అని కిరణ్ రాథోడ్ అంది. సోషల్ మీడియాలో టూ హాట్ అండ్ సెక్సీ ఫోటోలతో కన్పించే మీరు హౌజ్ లో అలా లేరెందుకని గీతు రాయల్ అడుగగా.. ఇది ఫ్యామిలీ షో కదా అందుకే ఇలా ఉన్నానని కిరణ్ రాథోడ్ అంది. బిగ్ బాస్ మీకో అవకాశం ఇస్తే మీలో మీరు ఏం మార్చుకుంటారని గీతు రాయల్ అడుగగా.. తెలుగు నేర్చుకొని, తెలుగులో మాట్లాడి, వాళ్ళకి నేనేంటో చూపిస్తానని కిరణ్ రాథోడ్ అంది. శోభా శెట్టి నాగిణి అని, శుభశ్రీ డంబ్ అని, దామిణి తను యాక్టింగ్ అని, పల్లవి ప్రశాంత్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని, చాలా ప్రిపేర్ అయి ఉన్నాడని కిరణ్ రాథోడ్ అంది. మరి గౌతమ్ గురించి చెప్పండని గీతు రాయల్ అడుగగా.. తర్వాత ఎలిమినేట్ అయ్యేది గౌతమే అని కిరణ్ రాథోడ్ అంది. బిబి బజ్ ప్రోమోలోనే ఇలా ఉంటే ఫుల్ ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి.