English | Telugu

శివాజీ మాస్ వార్నింగ్... బిగ్ బాస్ ఫిధా!

బిగ్ బాస్ సీజన్-7 రోజు రోజుకీ ఫుల్ హైప్ క్రియేట్ చేస్తుంది. ఎవరూ తక్కువ కాదన్నట్టు ఒక్కో కంటెస్టెంట్ రెచ్చిపోతున్నారు. ప్రతీ సోమవారం నామినేషన్లు ఉంటాయని అందరికి తెలిసిందే. అయితే బిగ్ బాస్ సీజన్-7 లోకి మొత్తం పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ రాగా అందులో నుండి ఆదివారం నాడు కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయింది. ప్రస్తుతం పదమూడు మంది కంటెస్టెంట్స్ ఉండగా.. సోమవారం నాడు నామినేషన్లు షురూ అయ్యాయి. ఇక రచ్చ రచ్చ అన్నట్టుగా ఒక్కో నామినేషన్ మొదలైంది‌. ఈ ప్రాసెస్ లో ఎక్కువ మంది శివాజీని నామినేట్ చేయగా, సరైన డిఫెడింగ్ చేస్తూ తన సత్తా చాటుకున్నాడు.

బిగ్ బాస్ చెప్తే వింటాను. ఇంకెవరు చెప్పినా వినని శివాజీ అంటున్నాడు. ఐ ఆమ్ ఏ ఎంటర్ టైనర్, ఐ ఆమ్ గివింగ్ ఎంటర్టైన్మెంట్. ఈ హౌజ్ లోకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికే ఇక్కడికి వచ్చాను. ఇస్తాను అంటు శివాజీ చెప్పే మాటలు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్-7 లోకి గ్రాంఢ్ గా కమ్ బ్యాక్ ఇచ్చిన కంటెస్టెంట్ శివాజీ. గత వారం శివాజీ పర్ఫామెన్స్ కి బిగ్ బాస్ కూడా ఫిధా అయ్యాడు. ఇక ఆదివారం నాగార్జున రాగానే వాజీ .. శివాజీ అంటు పొగిడేశాడు. ఇక సోమవారం జరిగిన నామినేషన్లో శివాజీ ఒక్కొక్కరికి దిమ్మతిరిగే సమాధానమిచ్చాడు.

ఒక్కొక్కరుగా బురద కింద నిల్చొని ఉంటే కంటెస్టెంట్స్ తమ నామినేషన్లు చెప్పాలని కోరగా.. శివాజీ నామినేషన్లో నిల్చున్నాడు. ఇక శివాజీని అమర్ దీప్ నామినేట్ చేసి కారణాలు చెప్పాడు‌. ' పల్లవి ప్రశాంత్ వేటాడానికి వచ్చాడు. వాడికి ఫోకస్ ఉంది. వాడు మగాడంటే, మరి నేను ఆడటానికి కాకుండా పేకాడటానికి వచ్చానా' అంటూ శివాజీతో అనగా.. నా ఇష్టం నేనంటాను. నీ ఒక్కడితోనే అనలేదు. అక్కడున్న అందరితో అన్నానని శివాజీ అంటాడు. మీరలా అంటుంటే అసలు నేను హౌజ్ లో ఉన్నానా అనే ఫీలింగ్ వస్తుందన్నా నాకు అని అమర్ దీప్ అనగా.. ముందు గేమ్ ఆడు అని శివాజీ మాస్ వార్నింగ్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత ప్రియాంక జైన్ వచ్చి శివాజీని నామినేట్ చేసింది. "మీరు గతవారం ఇసుక పోసేప్పుడు అసలు ఎదుటివాళ్ళని మాట్లాడనివ్వడం లేదని, దబాయిస్తున్నావ్" అని ప్రియాంక జైన్ అనగా.. "ఇది ఒక రీజనా, అయినా నీ మాట నేనెందుకు వింటాను. అది నీ పర్సనల్‌. ఇక్కడ బిగ్ బాస్ మాట తప్ప ఎవరి మాట వినను" అని శివాజీ అన్నాడు.

సర్ మీ ప్రవర్తన సరికాదు. నేను ఇలా పొలైట్ గా మాట్లాడుతున్నప్పుడు మీరు ఇలా ఆపేయ్ అని చేతితో అనడం బాగోలేదని ప్రియాంక జైన్ అనడంతో.. నీకంత లేదమ్మా అని శివాజీ అన్నాడు. ఇక ఆ తర్వాత వరుసగా దామిణి, షకీల వచ్చి నామినేట్ చేశారు. దాంతో అందరూ ఇలా చేశారని పైనుండి బురద పడుతుంటే.. "భారతీయుడు" సినిమాలోని.. 'పచ్చని చిలుకలు తోడుంటే' పాట పాడుతూ ఎంజాయ్ చేశాడు. తను వినోదాన్ని పంచడానికే బిగ్ బాస్ కి వచ్చానంటూ గట్టిగా చెప్పాడు శివాజీ.