English | Telugu
ప్రాణాలతో పోరాడి గెలిచిన పంచ్ ప్రసాద్
Updated : Sep 12, 2023
జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ కొంతకాలంగా కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అతని ఆరోగ్యం గురించి సన్నిహితులు, జబరదస్త్ అభిమానులు ఎంతో ఆందోళన చెందారు. అయితే తాజాగా అతనికి జరిగిన ఆపరేషన్ విజయవంతమైంది. అతను త్వరలోనే మునుపటి పంచ్ ప్రసాద్ లా మళ్ళీ ప్రేక్షకులను అలరించనున్నాడు.
జబర్దస్త్ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు చేరువైన ప్రసాద్.. తన పంచ్ లతో తక్కువ సమయంలోనే పంచ్ ప్రసాద్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అందరిని నవ్విస్తూ సాఫీగా సాగిపోతున్న అతని జీవితంలో అనుకోని కష్టం ఎదురైంది. రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. ట్రాన్స్ ప్లాంటేషన్ కి కావాల్సినంత డబ్బు లేకపోయినప్పటికీ.. ధైర్యం కోల్పోకుండా, డయాలసిస్ చేయించుకుంటూ, ఎప్పటిలాగే నవ్విస్తూ వచ్చాడు. అయితే మధ్యలో అతని ఆరోగ్యం విషమించిందని వార్తలొచ్చాయి. ఈ క్రమంలో అతనికి ఆర్థికంగా అండగా నిలబడటానికి పలువురు ముందుకు రావడం, డోనర్ కూడా ఉండటంతో.. తాజాగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ఆపరేషన్ జరిగింది. ట్రాన్స్ ప్లాంటేషన్ విజవంతమై తాను ఆరోగ్యంగా తిరిగి రావడంతో.. దీనికి కారణమైన వారందరికీ సోషల్ మీడియా వేదికగా కృతఙ్ఞతలు తెలిపాడు ప్రసాద్.