English | Telugu

అమర్ దీప్ ఫ్యాన్స్ కి బుర్ర లేదంటు వార్నింగ్ ఇచ్చిన కీర్తిభట్!

బిగ్ బాస్ సీజన్-7 లో అమర్ దీప్ కి ఉన్న ఫ్యాన్స్ కంటే సీజన్-6 లో కీర్తిభట్ కి ఉండే ఫ్యాన్సే ఎక్కువ. సీజన్-6 లో ఏ కంటెస్టెంట్ సపోర్ట్ లేకుండా టాప్-5 లో ఉన్న ఏకైక ఫీమేల్ కంటెస్టెంట్ కీర్తిభట్.

బిగ్ బాస్ సీజన్-6 షో ముగిసాక కీర్తిభట్ కి ఫ్యాన్ బేస్ పెరిగింది. ఆ తర్వాత "మధురానగరిలో" అనే సీరియల్ లో నటిస్తుంది. ఇక ఇలా బుల్లితెరపై విశేష అభిమానాన్ని పొందిన ఈ కన్నడ భామ తెలుగు రాష్ట్రాలలోని ప్రతీ ఇంట్లో అమ్మాయిలా ఆదరణ పొందుతుంది. దాంతో "మీ ఇంటి కీర్తి" అనే యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసి అందులో తనకి సంబంధించిన వ్లాగ్ లు చేస్తుంది కీర్తిభట్. ‌ప్రస్తుతం వాటికి విశేష స్పందన లభిస్తోంది.

కీర్తిభట్ తన ఫ్రెండ్ ని పెళ్ళి చేసుకొని ప్రస్తుతం హ్యాపీగా ఉంది. అయితే గత కొన్ని రోజులుగా రాంగ్ మెసెజ్ లు, రాంగ్ కాల్స్, రాంగ్ ఈమెయిల్స్ వస్తున్నాయంటూ ఒక పోస్ట్ ని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ పోస్ట్ లో తను ఏం చెప్పిందంటే.. బయట కొన్ని ఇంటర్వ్యూలకి హాజరయిమప్పుడు.. బిగ్ బాస్ సీజన్-7 లో‌ ఎవరు బాగా ఆడుతున్నారు ఎవరికి మీ సపోర్ట్ అని అడుగగా.. అప్పుడు నేను చూసిన ఆట ప్రకారం అంబటి అర్జున్ హౌస్ లో బాగా టాస్క్ లు ఆడుతున్నాడు. ఒంటరిగా ఆడి ఎవరి సపోర్ట్ లేకుండా పోరాడి టికెట్ టు ఫినాలే గెలిచాడు. నా సపోర్ట్ అర్జున్ కి అని చెప్పాను. అది విని అమర్ దీప్ ఫ్యాన్స్ నాకు నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు.

అంత వల్గర్ గా మెసెజ్ లు చేయాల్సిన అవసరం ఏం ఉంది. నా పాయింటాఫ్ వ్యూలో నేను చెప్పాను. అంతే కానీ ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేదు. అంతేకానీ అమర్ ని తక్కువ చేసి మాట్లాడానని నన్ను ఇలా తిడుతూ కామెంట్లు చేయడం కరెక్టేనా, అసలు సెన్స్ ఉందా మీకు? బుర్రలు పనిచేస్తున్నాయా మీకు నేను వాళ్లకి సపోర్ట్ చేస్తున్నానో లేదో మీకు తెలుసా? అసలెందుకని ఇలా వల్గర్ గా మెసెజ్ లు చేస్తున్నారంటూ అమర్ దీప్ ఫ్యాన్స్ కి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది కీర్తిభట్. ఇప్పుడు ఇది ఇన్ స్టాగ్రామ్ లో ఫుల్ వైరల్ గా మారింది. ఇలా అమర్ దీప్ ఫ్యాన్స్ కి నిజంగానే బుర్రలేదని మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేసుకుంటున్నారు. ఒక్క గేమ్ కూడా ఫెయిర్ గా ఆడని అమర్‌దీప్ కి ఓట్ చేసే ఫ్యాన్స్ ని ఇప్పటికే సోషల్ మీడియాలో నిబ్బాలని అంటూ ట్రోల్స్ చేస్తున్న విషయం తెలిసిందే.