English | Telugu
Krishna Mukunda Murari:కృష్ణకి పెళ్లి జరిగిందని తెలుసుకున్న మురారి.. ఏం చేయనున్నాడు?
Updated : Dec 7, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'
ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -334 లో.. ముకుంద మురారీల పెళ్లి చెయ్యడానికి భవాని అన్నీ సిద్ధం చేస్తుంది. పసుపు కొట్టి, పెళ్లి పనులు మొదలు పెడుతారు. దానికి కృష్ణ కూడా వస్తుంది. అందరితో కలివిడిగా ఉంటుంది కృష్ణ. మరొక వైపు మురారి ఒంటరిగా కృష్ణ అన్న మాటలు గుర్తుకు తెచ్చకుంటాడు.
ఆ తర్వాత మురారి దగ్గరికి మధు వచ్చి.. పసుపు దంచే ప్రోగ్రామ్ అంత వీడియో తీసాను ఇది అప్లోడ్ చేయాలని అనగానే నువ్వు రీల్స్ తీస్తావ్ కదా అని మురారికి గతం గుర్తుకు వచ్చినట్లు మాట్లాడతాడు. మరొక వైపు ముకుంద, మురారీల పెళ్లి గురించి ముకుంద తొందరపడుతుంది. అక్క ఇటు వైపు చుస్తే కృష్ణ మురారి లు ఇలా ఉన్నారని సుమలత అనుకుంటుంది. మరొక వైపు మురారి, మధుల దగ్గరికి కృష్ణ వస్తుంది. ఈ వీడియో రీల్స్ అంటూ మురారి మాట్లాడేసరికి మురారికి గతo గుర్తుకు వస్తుందని కృష్ణ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఇది వరకు తీసిన రీల్స్ చూయించు అని మురారి అనగానే వద్దని మధుకి చెప్తుంది కృష్ణ. ఆ తర్వాత కృష్ణ మురారీ రీల్స్ తీస్తుంటే మధు వీడియో తీస్తాడు. భవాని చూస్తుందేమోనని మధు వీడియో తియ్యడం ఆపేస్తాడు. మరొకవైపు రేవతి, మధు ఇద్దరు కలిసి కృష్ణ గురించి గొప్పగా చెప్పుకుంటారు. కృష్ణకి చాలా దైర్యం ఉంది. ఈ ప్రాబ్లమ్ నుండి బయట పడుతుందంటు కృష్ణ గురించి రేవతి చెప్తుంది. మరొకవైపు ఎప్పటిలాగే కృష్ణ, ముకుందల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది.
మరొకవైపు అందరూ హాల్లోకి వస్తారు. కృష్ణ ఇక నువ్వు వెళ్ళు అని భవాని అనగానే.. ఎందుకు కృష్ణని అంత చీప్ గా చూస్తున్నారు. అన్ని విషయాలు తెలియాలి అంటే జైల్లోకి వెళ్లి వాళ్ళ చిన్నాన్నని అడిగి తెలిసికోవాలని మురారి అనుకుంటాడు. ఆ తర్వాత కృష్ణ దీపాలు వదలాలి. మీరు వస్తారా అని రేవతిని కృష్ణ అడుగుతుంది . రాదని ముకుంద అంటుంది. ఆ తర్వాత కృష్ణ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అసలు దీపాలు వదలడం ఏంటి అని మురారి అనగానే.. దొరికింది మంచి ఛాన్స్ అని భవాని అనుకుని కృష్ణ తన భర్త బాగుండాలి అని అలా చేస్తుందని అనగానే మురారి ఒక్కసారిగా కృష్ణకి పెళ్లి అయిందా అని ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత అదే విషయం గుర్తుకు చేసుకుంటు ఉంటాడు. అప్పుడే నందు వస్తుంది. నందుని కృష్ణ గురించి అడుగగా.. కృష్ణ ఇండైరెక్ట్ గా నిన్ను అక్కడికి రమ్మంది అని నందు చెప్తుంది. మరొక వైపు మురారికి గతం గుర్తుకు వస్తుందని టెన్షన్ పడుతుంది ముకుంద. అదే విషయాన్ని భవాని దగ్గరికి వెళ్లి చెప్తుంది ముకుంద. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..