English | Telugu
షోలో నిఖిల్ మీద పంచులు..ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్తారు అంటూ కౌంటర్లు
Updated : Mar 3, 2025
బుల్లితెర మీద నిఖిల్ - కావ్య జోడి ఎంత సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలుసు..ఐతే ఎవరి దిష్టి కొట్టిందో వాళ్ళ మధ్య ఎం జరిగిందో కానీ ఇద్దరూ విడిపోయారు. పెళ్లి వరకు కూడా వెళ్ళిపోతారు అని ఆడియన్సు అంతా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ నిఖిల్ బిగ్ బాస్ 8 కి వెళ్లే సమయానికి ఇద్దరూ విడిపోయారు. ఎవరికి వాళ్ళు సింగల్ గా షోస్ చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఈ ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోకి శ్రీముఖి కావ్యని ఇన్వైట్ చేసి ఎన్నో విషయాలు అడిగింది.
ఈ షోలో కావ్య తనకు కాబోయే అబ్బాయి ఎలా ఉండాలో అతనిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో కూడా రాసి మరీ చూపించింది.వెనక నుంచి 'బుజ్జితల్లి వచ్చేత్తనానే" అనే డైలాగ్ వస్తూనే ఉంది. ఇక శ్రీముఖి పెద్ద కౌంటర్ వేసింది. " బిగ్ బాస్ 8 ఐన దగ్గర నుంచి చెప్తున్నాడు..కానీ ఇంతవరకు బయటకే రావట్లేదు.." అంది.."అవసరమే లేదు" అంటూ కావ్య కూడా చెప్పేసింది. "ఇప్పుడు ఇక్కడ ఎవరు ఎం చెప్పినా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్తారు కానీ ఇక్కడికి రారు" అని లైఫ్ లో తగిలిన ఎదురు దెబ్బల కారణంగా చాలా సీరియస్ గా చెప్పింది. "నీ లైఫ్ లో కూడా ఎవరన్నా అబ్బాయి బుజ్జితల్లి అని పిలిచి వచ్చేస్తున్నా కదే..కాసేపు ఆగే ..కాసేపు నవ్వే...అని అంటే నువ్వు ఒప్పుకుంటావా" అని శ్రీముఖి అడిగింది. దానికి కావ్య "నమ్మకం లేదు" అని చెప్పేసింది కావ్య. ఇక బ్రహ్మముడి కావ్య కూడా చెప్పింది "ఒక్కసారి ఆడపిల్లకు నమ్మకం పొతే..మనసు బ్రేక్ ఐతే ఆ మనసును అతికించడానికి అదేం బోన్ కాదు గుండె" అని పెద్ద డైలాగ్ చెప్పింది. అండ్ ఫైనల్ గా చూస్తే నిఖిల్ కావ్య వాళ్ళ వాళ్ళ కోపాన్ని ఇలాంటి షోస్ లో తీర్చేసుకుంటున్నారు.