English | Telugu

Brahmamudi : బ్రహ్మముడి సీరియల్ లో అదిరిపోయే ట్విస్ట్.. వాళ్ళిద్దరిపై అనుమానం!    

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -264 లో... కావ్య గదిలోకీ రాగానే .. " ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదు " అని రాజ్ చిరాకుగా అంటాడు. కాసేపటికి రాజ్ కోపంగా మీ అక్క తప్పు చేసింది అన్నట్లుగా మాట్లాడేసరికి.. మా అక్క శీలంపై అనుమానిస్తున్నారు శీలాన్ని ఎలా నిరూపించుకుంటారని కావ్య అంటుంది.

ఆ తర్వాత నా అక్క తప్పు చెయ్యలేదని నిరూపిస్తాను. ఒక ఆడది ఒక మగాడికి సులువుగా లొంగుతుందనే నీ లాంటి పురుషుడికి గుణపాఠం చెప్తాను. ఇది ఒక స్త్రీ, పురుషుడికి మధ్య జరుగుతున్న అంతర్యుద్ధమని రాజ్ కి కావ్య సవాలు విసిరి వెళ్ళిపోతుంది. మరొకవైపు రాహుల్ అన్న మాటలు స్వప్న గుర్తుకు చేసుకొని బాధపడుతుంటుంది. అప్పుడే రాహుల్ వచ్చి.. మళ్ళీ స్వప్న తప్పు చేసింది అన్నట్లుగా మాట్లాడేసరికి స్వప్నకి కోపం వచ్చి.. ఇందాక అందరి ముందు చెంప దెబ్బ కొట్టిన సరిపోలేదా అని అనగానే.. రాహుల్ కీ కోపం వచ్చి నా కళ్ల ముందు కనిపించకని అనగానే రాహుల్ ని గదిలో నుండి బయటకు నెట్టివేసి డోర్ వేస్తుంది. ఎవరు చూడలేదు కదా అంటూ రాహుల్ అనుకుంటాడు. మరొక వైపు అప్పు తన తండ్రి అన్న మాటలు గుర్తుకు చేసుకుంటుంది. అప్పుడే కనకం వచ్చి మీ నాన్న చెప్పింది చెయ్యడం కరెక్ట్ అనిపిస్తుందని అంటుంది. ఆ తర్వాత అప్పు నేను ప్రేమించినట్లు, వాడు నన్ను ఎందుకు ప్రేమించలేదు. తిడితే పడ్డాడు. నా ప్రతి విషయంలో వాడు ఉన్నాడు. వాడికి నన్ను ప్రేమించాలని ఎందుకు అనిపించలేదు. ఆ అనామికతో క్లోజ్ గా ఉంటే నేను చూడాలేకపోతున్నానని అప్పు ఎమోషనల్ అవుతుంది.

మరుసటి రోజు ఉదయం రాజ్ నిద్రలేవగానే.. నన్ను ఆశీర్వదించండి. మా అక్క తప్పు లేదని నిరూపణ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నానని కావ్య రిక్వెస్ట్ చేస్తుంది. రాజ్ ఆశీర్వదించే వరకు రాజ్ ని ఆటపట్టిస్తుంది. మరొకవైపు అప్పుని టిఫిన్ చెయ్మమని అన్నపుర్ణ పిలుస్తుంది. ఇంత విషం పెట్టు అని అప్పు కోపంగా చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అప్పు విషయంలో ఏదైనా సలహా ఇవ్వు అక్క అని కనకం అన్నపుడు.. ఏం సలహా నువ్వు ఏది చేసిన ఆ ఇంట్లో ఇద్దరు కూతుళ్లకి ఇబ్బంది అని అన్నపుర్ణ చెప్తుంది. తరువాయి భాగంలో.. నాకు అంత హెల్ప్ చేసినవాడు ఇలా బ్లాక్ మెయిల్ చేస్తాడని ఎలా అనుకుంటానని స్వప్న అనగానే.. అరుణ్ వెనకాల ఉండి ఇదంతా ఎవరో చేయిస్తున్నారా అని కావ్యకి డౌట్ వస్తుంది. మా అక్క అరుణ్ కి డబ్బులు ఇస్తున్నప్పుడు తీసిన ఫోటోస్ మీ దగ్గరికి ఎలా వచ్చాయని రాహుల్, రుద్రాణి ఇద్దరిని కావ్య అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..

Brahamamudi: మోడల్ ఫోటోషూట్ కోసం కావ్య ఒప్పుకుంటుందా.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -908 లో.... రాజ్ గుర్రంపై కూర్చొని ఊరేగుతున్నట్లు తన ఫోటోని రాజ్ కి చూపిస్తుంది కావ్య. అది చూసి నన్ను అలా చేస్తావా అని కావ్య ఫోటోని మోడల్ గా పెట్టి చూపిస్తాడు. చీ బాలేదు తీసెయ్యండి అని కావ్య అంటుంది. కావ్య ఎప్పుడు సంప్రదాయంగా ఉంటుందని ఫోటో మర్చి చూపిస్తుంది. అది చూసి రాజ్ ఫ్లాట్ అవుతాడు. ఇంట్లోనే మోడల్ ని పెట్టుకొని బయట వెతుకుతున్నానని రాజ్ అనుకుంటాడు. ఎలాగైనా యాడ్ లో చెయ్యడానికి కావ్యని ఒప్పించాలని అనుకుంటాడు.

Karthika Deepam2: వైరా ఇచ్చిన డీల్ కి ఒకే చెప్పిన కాశీ.. పోలీస్ స్టేషన్ కి శ్రీధర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -545 లో....వైరా దగ్గరికి కాశీ వస్తాడు. కాశీ రాగానే రండి సర్ అని కాశీకీ వైరా మర్యాద ఇస్తుంటే నాకు మర్యాద ఇస్తున్నారేంటని కాశీ అడుగుతాడు. మీ రెజ్యుమె చూసాను.‌ చాలా బాగుంది. మనకంటే టాలెంట్ ఎక్కువ ఉన్నవాళ్లు మనకన్నా చిన్న ఏజ్ అయిన రెస్పెక్ట్ ఇవ్వాలని వైరా అంటాడు.. నాకు జ్యోత్స్న ఫోన్ చేసి చెప్పింది మీరు ప్రెజెంట్ ఏం చేస్తున్నారని వైరా అడుగగా జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓ దగ్గర పిఏగా చేస్తున్నానని కాశీ చెప్తాడు. ఏంటి అంత చిన్న జాబ్ చేస్తున్నారా అని వైరా అంటాడు.