English | Telugu
Guppedantha Manasu : చిత్రని కాపాడిన రిషి.. షాక్ లో దేవయాని!
Updated : Nov 27, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -931 లో.. వసుధారని బెయిల్ మీద అనుపమ విడిపిస్తుంది. ఆ తర్వాత వసుధార ఇంటికి వచ్చిన తర్వాత బాధపడుతుంటే.. నువ్వేం తప్పు చెయ్యలేదు. ఎందుకు బాధపడుతున్నావ్? నువ్వు తప్పు చేసావని మేం అనుకుంటున్నామని నువ్వు టెన్షన్ పడుతున్నావా? అలా ఏం కాదు. నువ్వు ఎప్పటికి తప్పు చెయ్యవ్. ఒకసారి నువ్వు తప్పు చేసావని పొరపాటు పడితే నీ దానికి శిక్ష అనుభవించానని రిషి అంటాడు.
నేను తప్పు చేసానని కాదు సర్.. నా వల్ల DBST కాలేజీ పేరు ఇప్పుడు మీడియాలో వచ్చింది. అందుకే అని వసుధార అనగానే.. అసలు ఏం జరిగిందో మొత్తం చెప్పని వసుధారని రిషి అడుగుతాడు. ఆరోజు రాత్రి చిత్ర మెసేజ్ చెయ్యడంతో ఏదో ప్రాబ్లమ్ లో ఉందని వెళ్ళాను కానీ ఆ మెసేజ్ చిత్ర చెయ్యలేదు. తనని ప్రేమించమని వెంటపడుతున్న అబ్బాయి చేసాడని అక్కడ జరిగిందంత రిషికి చెప్తుంది వసుధార. మీకు జరిగింది చెప్తుండగా అప్పుడే ఇలా జరిగిందని మీకు ఫోన్ వచ్చిందని వసుధార చెప్తుంది. దీని వెనకాల ఎవరో ఉండి నడిపిస్తున్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నా కనిపెడుతానని రిషి అంటాడు. మరొకవైపు శైలేంద్రతో ఫొన్ మాట్లాడుతుంది దేవయాని. నేను అక్కడ లేకున్న నాపై డౌట్ రాకుండా పని పూర్తి చేశానని దేవయానికి శైలేంద్ర చెప్తాడు. మరొకవైపు రిషి రాత్రి ఇంట్లో లేకపోయేసరికి.. వసుధార కంగారుగా మహేంద్ర దగ్గరికి వెళ్లి అడుగుతుంది. ఏం కంగారు పడకు. రిషి వెళ్లిన పని పూర్తి చేసుకొని వస్తాడని మహేంద్ర చెప్తాడు.
మరొకవైపు చిత్రని ప్రేమించిన అబ్బాయి రౌడీలని తీసుకొని చిత్రని చంపెయ్యాలని వస్తారు కానీ రిషి చిత్ర ప్లేస్ లో పిల్లోలు పెట్టి ఉంచుతాడు. అప్పుడే రౌడీలు చిత్ర అనుకొని కత్తితో పొడుస్తుంటారు. రిషి వచ్చి.. నాకు నీ మీద ముందే డౌట్ వచ్చింది అంటుంది. చిత్రని ప్రేమించిన అబ్బాయిని రిషి అంటాడు. ఆలోగా వాళ్ళు అక్కడ నుండి పారిపోతారు. రిషి వాళ్ళ వెనకాల వెళ్తాడు. మరుసటి రోజు ఉదయం పోలీసులు, చిత్ర పేరెంట్స్ కలిసి.. చిత్ర కన్పించడం లేదు.. నువ్వే కిడ్నాప్ చేసావంటూ నిలదీస్తారు. మరొకవైపు దేవయాని ఏర్పాటు చేసిన మనిషి ద్వారా అక్కడ జరిగేదంత వీడియో కాల్ లో చూస్తుంటుంది. ఆ తర్వాత చిత్ర ఎక్కడ ఉందని వాళ్ళ పేరెంట్స్ అడుగగా.. ఉంది చూపిస్తానని రిషి చిత్రని తీసుకొని రమ్మని మహేంద్రకి చెప్పగానే చిత్రని తీసుకొని వస్తాడు మహేంద్ర. అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.