English | Telugu

సింగర్ గా మారనున్న ఫైమా ? ఏ మూవీలో పాడుతోందంటే ...  


పటాస్ ఫైమా గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. జబర్దస్త్ లో తన స్కిట్స్ తో నవ్విస్తూ ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్ మెంట్ ని అందిస్తూ ఉంటుంది.అలాగే ఫైమా ఇన్స్టాగ్రామ్ లో చేసే రీల్స్ ఐతే బీభత్సంగా పేలతా ఉంటాయి. సోషల్ మీడియాలో ఫైమా బాగా వైరల్ అవుతూ ఉంటుంది. అలాంటి ఫైమా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఆస్క్ మీ ఏ క్వశ్చన్ అంటూ ఫాన్స్ కి అడిగింది. ఇక నెటిజన్స్ అంతా కూడా ఫైమా సింగింగ్ మీదే ఎన్నో ప్రశ్నలు అడిగారు. ఈ మధ్య ఫైమా తన కార్ లో కొత్త బాయ్ ఫ్రెండ్ ప్రవీణ్ నాయక్ తో వెళ్తూ కొత్త కొత్త సాంగ్స్ ని పాడుతోంది. అలాగే కొత్త కొత్త సాంగ్స్ కి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి డాన్స్ కూడా చేస్తూ ఆ రీల్స్ ని తన ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేస్తోంది. అవి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ని కూడా సొంతం చేసుకుంటున్నాయి.

ఇక ఇప్పుడు ఫైమాని నెటిజన్స్ సింగర్ గా మారాలి అంటూ కోరుకుంటున్నారు. అలాగే ఢీ షోలో పార్టిసిపేట్ చేయొచ్చు కదా అని కూడా అడుగుతున్నారు. "సింగర్ అవ్వు అక్కా నీకు మేమంతా సపోర్ట్ చేస్తాం...నీకు బ్రేక్ ఇస్తాం...సింగర్ ఐతే నీకు ఆస్కార్ అవార్డు వస్తుంది" అని అందరూ ముక్తకంఠంతో కోరుతుంటే ఫైమా మాత్రం చాలా సిగ్గు పడుతూ "ఏ ఊకో...మీ అన్న నా పాట విని హాస్పిటల్ లో పడ్డాడు. ఢీ షోలో వాళ్ళు పిలవాలి కదా" అంటూ ఆన్సర్స్ ఇచ్చింది. ఇంతవరకు ఫైమా జబర్దస్త్ లో బులెట్ భాస్కర్ టీమ్ లో లేడీ కమెడియన్ గా ఎంటర్టైన్ చేసింది. మరి తన ఫాన్స్ కోరిక మేరకు ఇప్పుడు ఆమె ఏమన్నా సింగర్ గా ఇండస్ట్రీలో ట్రై చేస్తుందా..లేదా చూడాలి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.