English | Telugu
Karthika Deepam2 : గుడికి వెళ్ళిన సుమిత్ర.. దశరథ్ ని చూసి షాక్!
Updated : Oct 29, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -500 లో......పారిజాతం, జ్యోత్స్న మాట్లాడుకుంటారు. గెలవాలంటే మనం అనుకున్నది చెయ్యాలని పారిజాతంతో జ్యోత్స్న అంటుంది. మరుసటి రోజు శివన్నారాయణ హాల్లో కూర్చొని ఉంటాడు. అప్పుడే కార్తీక్ వస్తాడు. నేను బయటకు వెళ్తున్నాను నాన్న ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చెయ్యండి అని అంటాడు. వీడు ఖచ్చితంగా గుడికి వెళ్తున్నాడని కార్తీక్, శివన్నారాయణ అనుకుంటారు. సరే వెళ్ళు కానీ కార్తీక్ ని కూడా తీసుకొని వెళ్ళమని శివన్నారాయణ అంటాడు. కార్తీక్, దశరథ్ ఇద్దరు బయల్దేర్తారు.
మరోవైపు జ్యోత్స్న, పారిజాతం ఇద్దరు మాట్లాడుకుంటారు. అసలు ఏం జరుగుతుంది మమ్మీ ఖచ్చితంగా ఆ దీప దగ్గర ఉంటుందని జ్యోత్స్న అనగా.. ఇప్పుడు మరొక తప్పు చెయ్యకని పారిజాతం అంటుంది. ఇప్పుడు తప్పు చేసే సిచువేషన్ కాదు తప్పుని సరిదిద్దుకునే సిచువేషన్ అని జ్యోత్స్న అక్కడ నుండి బయల్దేర్తుంది. మళ్ళీ ఇదేమో చేయబోతుందని పారిజాతం అనుకుంటుంది. మరొకవైపు ఎందుకు జాబ్ వచ్చిందని అబద్ధం చెప్పవని కాశీని శ్రీధర్ అడుగుతాడు. నాకు జాబ్ వచ్చింది అంటేనే మీరు సైలెంట్ గా ఉన్నారు.. లేదంటే రోజు నన్ను ఏదో ఒకటి అనేవారు.. అందుకే అబద్ధం చెప్పాను.. ప్లీజ్ మావయ్య ఈ విషయం స్వప్నకి చెప్పకండి అని శ్రీధర్ కాళ్ళు పట్టుకుంటాడు. సరే చెప్పనులే అని శ్రీధర్ అంటాడు. అది స్వప్న చూసి ఏంటి కాశీ మా డాడీ కాళ్ళు పట్టుకున్నాడని అనుకుటుంది. ఆ తర్వాత కార్తీక్, దశరథ్ గుడికి వెళ్తారు. కార్తీక్ వెటకారంగా మాట్లాడుతుంటే.. నాన్న, నువ్వు ఈ మధ్య ఇలా మాట్లాడుతున్నారేంట్రా అని దశరథ్ అంటాడు. అప్పుడే దీపకి కార్తీక్ ఫోన్ చేసి.. ఇదే కరెక్ట్ టైమ్ అత్తని గుడికి తీసుకొని రా అని చెప్తాడు. దానికి దీప సరే అంటుంది.
ఆ తర్వాత సుమిత్రని గుడికి తీసుకొని వెళ్ళాలని దీప తన గదిలోకి వెళ్తుంది. అక్కడ సుమిత్ర ఉండదు. అప్పుడే మా అమ్మ ఎక్కడ అని జ్యోత్స్న పోలీసులని తీసుకొని వస్తుంది. ఇల్లంతా వెతుకుతుంది. ఒకవైపు సుమిత్ర అమ్మ ఎక్కడ అని దీప టెన్షన్ పడుతుంటే జ్యోత్స్న వచ్చి అలా అడుగుతుంది. దీప, కాంచన ఇద్దరు టెన్షన్ పడుతారు. మరొకవైపు సుమిత్ర గుడికి వెళ్తుంది. దేవుడికి మొక్కుకొని వెనక్కి చూసేసరికి దశరథ్ ఉంటాడు. తనని చూసి సుమిత్ర షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.