English | Telugu
Karthika Deepam2 : జ్యోత్స్న అలా చేసిందని కనుక్కున్న కార్తీక్.. దీప చెంపచెల్లుమనిపించిన సుమిత్ర!
Updated : Mar 3, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -295 లో... టైమ్ కి కార్తీక్ వచ్చి దీపని సేవ్ చేస్తాడు. శౌర్యని కాపాడడానికి వెళ్తాడు. అక్కడ రౌడీ లు శౌర్యపై ఎటాక్ చేయబోతుంటే కార్తీక్ వాళ్ళని కొడుతాడు. ఎవరు ఇలా చెయ్యమన్నారని కార్తీక్ వాళ్ళని అడుగుతాడు. వాళ్ళు చెప్పకుండా పారిపోతారు. శౌర్యని తీసుకొని దీప దగ్గరికి వెళ్తాడు. వాళ్ళని తీసుకొని కార్తీక్ ఇంటికి వెళ్తాడు. మరొకవైపు సుమిత్ర జ్యోత్స్న కి పాలు తీసుకొని వస్తుంది. ఆ లోపు జ్యోత్స్న గోడదూకి సుమిత్ర గదిలోకి వెళ్తుంది.
సుమిత్ర వెళ్లేసరికి జ్యోత్స్న ఎప్పటిలాగే పడుకుంటుంది. జ్యోత్స్నని సుమిత్ర లేపి పాలు ఇస్తుంది. ఆ తర్వాత దీప, శౌర్యలని కార్తీక్ ఇంటికి తీసుకొని వెళ్తాడు. వాళ్లపై ఎటాక్ చేసింది నర్సింహా అనుకుంటారు. వాడికి తగిన బుద్ది చెప్పాలని అనసూయ అంటుంది. దీపని రెస్ట్ తీసుకోమని చెప్పి కార్తీక్ వాళ్ళు బయటకు వెళ్తారు. అమ్మ మనల్ని కొట్టింది బూచోళ్లతో పాటు జ్యో కూడా.. నీ మొహంపై కర్చీఫ్ పెట్టింది జ్యో అనగానే.. దీప కోపంగా జ్యోత్స్న దగ్గర వెళ్తుంది. మరొకవైపు జ్యోత్స్నకి పెళ్లి సంబంధం గురించి ఇంట్లో మాట్లాడుకుంటారు. అప్పుడే దీప ఎంట్రీ ఇస్తుంది గట్టిగా అరుస్తూ జ్యోత్స్న అని పిలుస్తుంది.
ఏమైందని దీపని పారిజాతం అడుగుతుంది. ఆల్రెడీ దీప వస్తుందేమోనని జ్యోత్స్న భయంతో వణుకుతుంది. శౌర్య దగ్గరికి కార్తీక్ వస్తాడు. మీ అమ్మ ఎక్కడ అని అడుగగా.. అమ్మ మొహంపై జ్యో కర్చీఫ్ పెట్టింది.. అదే విషయం అమ్మకి చెప్పాను అనగానే కార్తీక్ షాక్ అవుతాడు. ఇప్పుడు జ్యోత్స్న దగ్గరికి దీప వెళ్ళిందని కార్తీక్ వెళ్తాడు. మరొకవైపు జ్యోత్స్నని దీప తీసుకొని వచ్చి.. నీకేం అన్యాయం చేశామని నా కూతురిని నన్ను చంపాలని చూస్తున్నావని జ్యోత్స్న చెంప చెల్లుమనిపిస్తుంది దీప. అమ్మ నువ్వు చెప్పు ఇప్పటివరకు.. నీ గదిలో పడుకున్నా కదా అని జ్యోత్స్న అంటుంది. మళ్ళీ జ్యోత్స్నని దీప కొట్టబోతుంటే సుమిత్ర ఆపి.. నా కూతురిని ఎందుకు కొడుతున్నావంటూ దీప చెంప చెల్లుమనిపిస్తుంది సుమిత్ర. దాంతో అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.