English | Telugu
Eto Vellipoyindhi Manasu : రామలక్ష్మినే ప్రిన్సిపల్ అని చెప్పిన సందీప్.. సీతాకాంత్ తెలుసుకుంటాడా!
Updated : Mar 3, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -342 లో..... సీతాకాంత్ రామ్ దగ్గరికి వస్తాడు. రాగానే ఈ రోజు నీలాగా మిస్ ముందు చేసాను. దాంతో మిస్ నన్ను దగ్గరికి తీసుకొని కన్నీళ్లు పెట్టుకుందని సీతాకాంత్ తో రామ్ చెప్పగానే.. నాకు తెలుసు రామలక్ష్మి నువ్వు రామలక్ష్మివే అని సీతాకాంత్ అనుకుంటాడు. ఆ తర్వాత రామ్ ని సీతాకాంత్ పడుకోపెడతాడు. సీతాకాంత్ రామలక్ష్మితో ఉన్న జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటాడు. ఆ తర్వాత ఏదో ఆలోచిస్తూ ఈ విధంగా చేస్తే రామలక్ష్మి బయటపడుతుందని సీతాకాంత్ అనుకుంటాడు.
మరుసటి రోజు ఉదయం సీతాకాంత్ అందరిని గుడికి తీసుకొని వస్తాడు. ఎందుకు సడన్ గా తీసుకొని వచ్చావని శ్రీలత అడుగుతుంది. రేపు రామ్ పుట్టిన రోజు కదా.. ఏదో దోషం ఉందట పూజ చెయ్యాలని పంతులు గారు చెప్పారని అందుకే అని సీతాకాంత్ అంటాడు. ఆ మైథిలి రూపంలో రామ్ కి దోషం ఉందేమోనని శ్రీవల్లి అంటుంటే.. నువ్వు సైలెంట్ గా ఉండు మైథిలి గురించి సీతాకాంత్ కి తెలియకుడదని సందీప్ అంటాడు. ఆ తర్వాత సీతాకాంత్ అటుగా వస్తున్న రామలక్ష్మి కార్ కి పంచర్ చేయిస్తాడు. పంచర్ అయ్యేలోపు గుడికి వెళ్తానంటూ రామలక్ష్మి గుడికి వెళ్తుంది. రామలక్ష్మి లోపలికి వెళ్లి మొక్కుకుంటుంది. ఇప్పుడు మా వాళ్ళని చూసి నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో చూడాలని సీతాకాంత్ అంటాడు. శ్రీలత వాళ్ళని రామలక్ష్మి చూస్తుంది. మరొక వైపు సీతాకాంత్ ని చూస్తుంది. ఇప్పుడేం చెయ్యాలంటూ బయటకు వెళ్ళిపోతుంది. సీతాకాంత్ ఎదురుపడి.. ఏంటి ఎందుకు బయపడి వెళ్తున్నావ్.. రామలక్ష్మి అయితే వెళ్ళిపోతావ్.. మైథిలివి అయితే ఉంటావని సీతాకాంత్ అనగానే.. నేను మైథిలి అని రామలక్ష్మి లోపలికి వెళ్తుంది. రామలక్ష్మిని శ్రీలత వాళ్ళు చూసి.. ఎక్కడ సీతాకాంత్ చూస్తాడోనని టెన్షన్ పడతారు.
రామలక్ష్మి లోపలికి వెళ్లి మళ్ళీ దేవుడికి మొక్కుకుంటుంటే.. అప్పుడే రామ్, సీతాకాంత్ లు వెళ్తారు. మిస్ ఈ రోజు ఇక్కడ పూజ ఉంది.. మీరు ఉండండి అని రామ్ అంటాడు. వాళ్ళు ముగ్గురు అలా మాట్లాడుకోవడం శ్రీలత వాళ్ళు చూస్తారు. ఏంటి సీతాకి మైథిలి ముందే పరిచయం ఉన్నట్లు ఉంది.. రామ్ తనని మిస్ అంటున్నాడంటే వాళ్ల ప్రిన్సిపల్ తనేనేమో అని సందీప్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.