English | Telugu
Karthika Deepam2 : ఆపరేషన్ చేస్తే గానీ శౌర్య బ్రతకదు.. తల్లిపై పడి ఏడ్చేసిన కార్తీక్ బాబు!
Updated : Jan 24, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -263 లో...శౌర్య దగ్గరికి వెళదామన్న దీపని ఏదో ఒకటి చెప్పి కార్తీక్ ఆపుతాడు. ఈ టైమ్ కి శౌర్య తిని పడుకుంటుంది. మనం భోజనం చేద్దామని దీపతో కార్తీక్ అంటాడు. మరుసటిరోజు కార్తీక్ కి హాస్పిటల్ నుండి ఫోన్ వస్తుంది. ఫిఫ్టీ పెర్సెంట్ అమౌంట్ ఈ రోజే పే చేయాలని చెప్తారు. సరే కట్టేస్తామని కార్తీక్ అంటుంటే.. అపుడే దీప వచ్చి ఎవరికి డబ్బు కట్టాలని అడుగుతుంది. అదేం లేదు ఇప్పుడు నన్నేం అడగొద్దని కార్తీక్ చెప్పి వెళ్ళిపోతాడు. అది చూసిన అనసూయ కార్తీక్ దగ్గరికి వెళ్లి.. శౌర్య ఎలా ఉందని అడుగుతుంది. మీరు ఏదో దాస్తున్నారని అనసూయ అనగానే శౌర్య బాగుంది ఇలా అడగకండి దీప వింటుందని కార్తీక్ అంటాడు.
కార్తీక్ డబ్బు కోసం ఫైనాన్స్ ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఏదైనా ఆస్తులు తాకట్టు పెడితేనే ఇస్తామని అంటారు. అలా చాలా చోట్ల అప్పు కోసం తిరుగుతాడు చివరికి హాస్పిటల్ కి వెళ్తాడు. కాశీ తో మాట్లాడి లోపలున్న శౌర్య దగ్గరికి వెళ్తాడు. శౌర్యా నిద్ర పోతూ ఉంటుంది. నిన్ను ఎలాగైనా కాపాడుకుంటానని కార్తీక్ అనుకుంటాడు. నువ్వు ఇంటికి వెళ్ళమని కాశీతో కార్తీక్ అంటాడు స్వప్నకి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళానని చెప్తానని కాశీ అంటాడ. కానీ నువ్వు వెళ్ళమని కాశీని ఇంటికి పంపిస్తాడు కార్తీక్. ఆ తర్వాత కార్తీక్ చీకట్లో ఒక దగ్గర ఆగి అందరు అప్పు ఇవ్వనన్న విషయం గుర్తుచేసుకొని గట్టిగ అరుస్తూ ఉంటాడు.
ఆ తర్వాత అనసూయ, కాంచన లు బయట కూర్చొని ఉంటారు. అక్కడ కార్తీక్ చీకట్లో ఉండడం చూసి కాంచన పిలుస్తుంది. ఏమైందిరా శౌర్యని ఏ హాస్పిటల్ జాయిన్ చేసావని కాంచన అనగానే కార్తీక్ చిన్నపిల్లాడిలాగా కాంచనపై పడి ఏడుస్తాడు. శౌర్యకి ఆపరేషన్ చేయకుంటే బ్రతకదు.. అందుకే హాస్పిటల్ లో అడ్మిట్ చేశానని జరిగింది మొత్తం కాంచన అనసూయలకి చెప్పగానే వాళ్లు బాధపడతారు. అప్పుడే దీప వస్తుంది. అంత దీప వినేసిందని అనుకుంటారు కానీ దీప వినదు. నన్ను శౌర్య దగ్గరికి తీసుకొని వెళ్లమని అంటున్నా తీసుకొని వెళ్లట్లేదని దీప అంటుంది. కార్తీక్ డైవర్ట్ చేస్తూ వేడి నీళ్లు పెట్టు అంటూ లోపలికి వెళ్తాడు. మీరేం చెప్పరని కాంచన, అనసూయలతో దీప అంటుంది. దీప లోపలికి వెళ్ళిపోయాక కాంచన, అనసూయలు శౌర్య గురించి బాధపడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.