English | Telugu
Karthika Deepam2 : తెలివిగా సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసిన జ్యోత్స్న.. శౌర్య కోసం ఎమోషనల్ అయిన దీప!
Updated : Jan 23, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -262 లో.....పోలీసుల ఎంక్వయిరీ లో నేనే దాస్ ని కొట్టానని తెలుస్తుందా అని జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. అప్పుడే పోలీసులు ఇంటికి వస్తారు. దాంతో జ్యోత్స్న టెన్షన్ మరింత పెరుగుతుంది. దాస్ గురించి కంప్లైంట్ ఇచ్చారు కదా అని ఇన్‌స్పెక్టర్ అనగానే.. అవును వాడు నా కొడుకు అని పారిజాతం అంటుంది. తనకి అయిన దెబ్బలు చూస్తుంటే అవి ఆక్సిడెంట్ అయిన దెబ్బలు లాగా లేవు.. ఎవరో బలవంతం గా కొట్టినట్లు ఉందని ఇన్‌స్పెక్టర్ అనగానే.. అందరు షాక్ అవుతారు. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా తన ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేస్తే చివరగా ఇక్కడ చూపించింది. తర్వాత సిగ్నల్ చూపించలేదని ఇన్‌స్పెక్టర్ అంటాడు.
అతను చివరగా ఇక్కడికి వచ్చాడని ఇన్‌స్పెక్టర్ అనగానే లేదు ఇంటికి రాలేదని శివన్నారాయణ అంటాడు. అవును వాడు రాలేదని పారిజాతం కూడా చెప్తుంది. అయితే ఒకసారి సీసీటీవీ పూటేజ్ చూపించండి అని ఇన్‌స్పెక్టర్ అనగానే ఇప్పుడు జ్యోత్స్న దొరికిపోతుంది అని దశరథ్ టెన్షన్ పడతాడు. మరొకవైపు దీప గుమ్మం దగ్గర ఉండి బాధపడుతుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు. శౌర్య గురించి దీప అడుగుతుంటే కార్తీక్ కవర్ చెయ్యలేక ఇబ్బంది పడుతాడు. మరోవైపు సీసీటీవీ ఫుటేజ్ లో దాస్ ఇంటికి వచ్చిన రోజు ఫుటేజ్ మిస్ అవుతుంది. అదేంటీ ఫుటేజ్ లేదని ఇన్‌స్పెక్టర్ అడుగగా.. నేనే డిలీట్ చేసాను అని జ్యోత్స్న తన మనసులో అనుకుంటుంది. సిస్టమ్ రిపేర్ కి ఇచ్చానని జ్యోత్స్న చెప్పగా.. సరేనని ఇన్‌స్పెక్టర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు.
చాలా తెలివిగా భయటపడ్డావని దశరథ్ అనుకుంటాడు. నువ్వే ఈ తప్పు చేసావని నాకు తెలుసు కానీ నాకూ తెలుసన్న విషయం నీకు తెలియదని దశరథ్ అనుకుంటాడు. దీప అందరికి భోజనం పెడుతుంది. శౌర్య త్వరగా రా అంటుంది. శౌర్యా లేదని కార్తీక్ గుర్తు చెయ్యడంతో దీప ఎమోషనల్ అవుతుంది. నాకు శౌర్యని చూడాలని ఉంది.. పదండి వెళదామని దీప అంటుంటే.. కార్తీక్ కి ఏం చెప్పాలో అర్థం కాదు. తను తినేసి పడుకుండి ఉంటుందని కార్తీక్ అంటాడు. నమ్మకం లేకపోతే ఫోన్ చేయమని కార్తీక్ అంటాడు. ఏదో అలా చెప్పాను. ఇప్పుడు ఫోన్ తీసుకొని కాల్ చేస్తే పరిస్థితేంటని కార్తీక్ టెన్షన్ పడులతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.