English | Telugu
Eto Vellipoyindhi Manasu : లైవ్ లో భద్రం గురించి చెప్పిన సీతాకాంత్.. అది జరిగేనా!
Updated : Jan 23, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -309 లో..... ధన, సందీప్ లు చేసిన పనికి సీతాకాంత్ జనాలతో రాళ్ల దెబ్బలు పడ్డాడు. దాంతో పట్టరాని కోపంతో రామలక్ష్మిని తీసుకొని శ్రీలత ఇంటికి వెళ్తాడు సీతాకాంత్. బెల్ట్ తీసుకొని ధన, సందీప్ లని చితక్కొట్టుడు కొడుతాడు. నీకేం అధికారం ఉందని నా కొడుకు అల్లుడిని కొడుతున్నావని చెప్పి సీతాకాంత్ ని ఆపుతుంది శ్రీలత.
వాళ్లేం చేసారో తెలుసా అని సీతాకాంత్ అనగా.. ఏం చేసిన సరే వాళ్ళని కొట్టే అధికారం లేదు.. వాడు నా కొడుకు అని శ్రీలత అంటుంటే.. సీతాకాంత్ షాక్ అవుతాడు. మీరు ఆస్తులు బాగా చూసుకుంటారనే కదా మీకు రాసిచ్చింది. ఇప్పుడు కంపెనీకి నాకు బ్యాడ్ నేమ్ తీసుకొని వస్తుంటే ఎలా ఊరుకుంటానని సీతాకాంత్ అంటాడు. దాంతో సీతాకాంత్ బాధపడేలా శ్రీలత మాట్లాడేసరికి సీతాకాంత్ వెళ్లిపోతాడు. భద్రం మాత్రం సీతాకాంత్ ని జనాలు రాళ్లతో కొట్టిన వీడియో చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరొకవైపు సందీప్ కి శ్రీవల్లి దెబ్బలకి మందు రాస్తుంది. ధన దగ్గరికి సిరి వచ్చి మందు రాయాలా అని అడుగుతుంది. అప్పుడు ఇంకా కొట్టమని చెప్పి ఇప్పుడు ఇలా అంటున్నావా అని ధన కోప్పడతాడు. మీరు నా డెలివరీ వరకు మారలేదో నేను మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతానంటూ సిరి అందరికి జలక్ ఇస్తుంది. ఆ తర్వాత శ్రీలత ఒకతనికి ఫోన్ చేసి మాట్లాడుతుంది. సీతాకాంత్ ఇంటికి వచ్చి కొట్టిన విషయం చెప్తుంది. వాడికి మూడు రోజుల టైమ్ ఉంది. ఈ లోపు భద్రం గాడు వాడి కంటపడకూడదు. సీతాకాంత్ రామలక్ష్మి గురించి తక్కువ అంచనా వెయ్యకని అతనితో శ్రీలత చెప్తుంది.
సీతాకాంత్ జరిగింది గుర్తు చేసుకొని బాధపడుతుంటాడు. అది డైవర్ట్ చెయ్యడానికి రామలక్ష్మి ట్రై చేస్తుంది. మరుసటిరోజు ఉదయం అప్పుడే సన్నీ వచ్చి లైవ్ ప్రోగ్రాం చేద్దామని అంటుంది. వద్దని సీతాకాంత్ అనగానే.. చేద్దాం ఇలా లైవ్ లో భద్రం గురించి చెప్దామని రామలక్ష్మి అంటుంది. దాంతో సీతాకాంత్ సరే అంటాడు. లైవ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. మీరు వ్యాపారం చెయ్యాలనుకుంటున్నారా.. మీకు ఇతను పెట్టుబడి పెడతాడంటూ భద్రం ఫోటో చూపిస్తాడు. అతన్ని కలిసి అతనితో సెల్ఫీ తీసుకొని నాకు పంపిస్తే మీకు అతను పెట్టుబడి పెట్టెలా.. నేను చేస్తానని అనౌన్స్ మెంట్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.