English | Telugu

దీప మెడలో తాళి కట్టిన కార్తీక్.. షాక్ లో జ్యోత్స్న!


కార్తీక దీపం-2 ప్రారంభం అయి రెండోందల ఎపిసోడ్ కి చేరువలో ఉంది. మొదటి నుండి ఈ సీరియల్ పై కొంచెం నెగటివిటి ఉంది. ఎందుకంటే మెయిన్ క్యారెక్టర్ లు దీప, కార్తీక్ లు. అయితే దీపకి ఆల్రెడీ నర్సింహాతో పెళ్ళై ఒక పాప కూడా ఉంటుంది. హీరో, హీరోయిన్ తో పెళ్లి కాకుండా వేరొకరితో పెళ్లి ఏంటి? పాప ఏంటని నెగెటివ్ కామెంట్లు వచ్చాయి. దీప, నర్సింహాలతో గొడవలు నర్సింహాతో విడాకులు అవుతాయి.

అది ఇలా ఉంటే కార్తీక్, శౌర్యలు అనుకోకుండా ఫ్రెండ్స్ అవుతారు. ఎంతలా అంటే నాన్నగా కార్తీక్ ఉంటే బాగుండు అనేలా....క్లోజ్ అవుతుంది. శౌర్య మాటి మాటికీ కళ్ళు తిరిగి పడిపోవడంతో కార్తీక్ హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాడు. డాక్టర్ అన్ని టెస్ట్ లు చేసి శౌర్య హార్ట్ వీక్ ఉందని చెప్తాడు. ఆ విషయం దీపకి చెప్పడు కార్తీక్. మరోవైపు దీపతో గొడవపడుతుంది కార్తీక్ మరదలు జ్యోత్స్న. నా బావని నాకు కాకుండా చేస్తున్నావ్.. నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోమని దీపని జ్యోత్స్న అంటుంది. దాంతో శౌర్యని తీసుకొని వెళ్తుంటే.. దీపకి శౌర్య తెలియకుండా కార్తీక్ ని కలుద్దామనుకొని వెళ్తుంది. కార్తీక్ కార్ వెంట శౌర్య పరిగెత్తి.. కింద పడిపోతుంది. అది చూసి శౌర్యని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాడు కార్తీక్. తనకి డీసెస్ ఉంది రెండు కోట్లు ఖర్చు అవుతుందని డాక్టర్ చెప్తాడు.

ఇక శౌర్యా కోసం దీప కార్తీక్ ఇంటికీ వస్తుంది. నేను శౌర్యని తీసుకొని వెళ్తానని దీప అంటుంటే.. కార్తీక్ వద్దని చెప్తాడు. శౌర్యని ఇప్పుడు హ్యాపీగా ఉంచాలని అనుకుంటాడు. తాజాగా వచ్చిన ప్రోమోలో కార్తీక్ దీప మెడలో తాళి కడతాడు. ఇక బావనే ప్రాణంగా బ్రతుకుతున్న జ్యోత్స్న అదంతా చూసి షాక్ అవుతుంది. అయితే కార్తీక్ మాత్రం శౌర్య కోసం అదంతా చేసాడు. ఇప్పటికి డైరెక్టర్ ప్రేక్షకులకు నచ్చేలా కథని మలిచాడు. ఇక నుండి ఈ సీరియల్ మరింత రసవత్తరంగా సాగుతుందనడంలో ఆశ్చర్యం లేదు. మరి కార్తీక్ తన మెడలో కట్టిన తాళిని దీప యాక్సెప్ట్ చేయగలదా లేదా చూడాలి మరి.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...