English | Telugu

Karthika Deepam2 : నా కూతురు కోసం వచ్చాను.. పారిజాతానికి షాకిచ్చిన కొడుకు! 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీకదీపం 2'(karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -125 లో.... జ్యోత్స్న దీప రూమ్ కి తాళం వేస్తుంది. అలా ఎందుకు వేస్తున్నావని సుమిత్ర అడుగుతుంది. దీపని తీసుకొని‌ బావ రెస్టారెంట్ కి వెళ్ళాడని జ్యోత్స్న అనగానే.. నేనే శౌర్యకి ఆకలిగా ఉందంటే తీసుకొని వెళ్ళమన్నానని సుమిత్ర అంటుంది. అంటావ్ ఎటైనా సరదాగా కూడా తిరిగి రమ్మని బావని పంపిస్తావ్ అని జ్యోత్స్న అనగానే.. తనని కొట్టడానికి చెయ్ ఎత్తుతుంది సుమిత్ర. అప్పుడే దీప రావడం చూసి ఆగిపోతుంది. ఇదిలా తయారవ్వడానికి కారణం మీరే అంటు పారిజాతాన్ని సుమిత్ర తిడుతుంది.

అ తర్వాత జ్యోత్స్న, పారిజాతం లు వెళ్ళిపోతారు.‌ జరిగిన దాని గురించి సుమిత్ర కవర్ చేస్తుంటే.. అంత చూసానని దీప అంటుంది. ఇప్పుడు మనసు కొంచెం తేలిక అయింది కానీ అలా జ్యోత్స్న ఎప్పుడు అవుతుందో అని దీప అనగానే.. థాంక్స్.. జ్యోత్స్నని అర్థం చేసుకున్నందుకు అని సుమిత్ర అంటుంది. అ తర్వాత శౌర్య ఎక్కడ కన్పించడం లేదని సుమిత్ర అడుగగా.. అదిగో అక్కడ కూర్చొని ఉంది.. అలిగిందని చెప్తుంది. తనకి ఇష్టమైనవి వండాలంట.. నేనే వండుతానని దీప అంటుంది. మరొకవైపు కార్తీక్ ఇంటికి వెళ్లడంతోనే శ్రీధర్.. శౌర్యకి కార్తీక్ తినిపిస్తున్న ఫోటో చూపించి.. అవసరమా వాళ్ళని తీసుకొని వెళ్లడమని శ్రీధర్ కోప్పడతాడు. శౌర్యకి ఆకలిగా ఉందంటే తీసుకొని వెళ్ళాను.. అక్కడ తినిపించింది శౌర్యకి, దీపకి కాదని కార్తీక్ కోప్పడతాడు. అ ఫోటో పంపిన వాళ్లు ఎంత బాధపడుతున్నారో తెలుసా అని శ్రీధర్ అనగానే.. అది జ్యోత్స్న పంపించింది కదా.. తనని మనసుతో ఆలోచించమని చెప్పండని కార్తీక్ అంటాడు.

మరొకవైపు స్వప్న బాయ్ ఫ్రెండ్ సిటీ కి వస్తాడు. ఇన్ని రోజులు నాకు దూరంగా ఉన్నావంటూ స్వప్న అతనితో గొడవపడుతుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి రెస్టారెంట్ కి వెళ్తారు. అ తర్వాత కుబేర్ ఫోటో చూసి దీప ఎమోషనల్ అవుతుంది. మరొకవైపు పారిజాతం తన కొడుకు దాస్ గురించి ఆలోచిస్తుంది. అప్పుడే దాస్ వస్తాడు. ఎలా ఉన్నావని, ఎందుకు వచ్చావని పారిజాతం అడుగుతుంది. నా కూతురు కోసం వచ్చానని దాస్ అనగానే.. అది చనిపోయింది కదా అని పారిజాతం అంటుంది. నా కూతురు బ్రతికే ఉందని.. ఆ విషయం నాకు తెలుసని నీకు తెలియదని దాస్ అనుకుంటాడు. తన కూతురు ఉందన్న విషయం దాస్ కి తెలియదని పారిజాతం అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.