English | Telugu
Karthika Deepam2 : కార్తీక్, దీపల పెళ్ళికి ఏర్పాట్లు షురూ.. జ్యోత్స్న ఏం చేయనుంది!
Updated : Aug 22, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -442 లో.. శివన్నారాయణ ఇంటికి వస్తాడు శ్రీధర్. నువ్వు వచ్చావేంటి మా ఆయన చుస్తే నువ్వు అయిపోతావని పారిజాతం అంటుంది. నేనే కాదు అత్త మా బ్యాచ్ కూడా వచ్చారని శ్రీధర్ అంటాడు. అప్పుడే కాంచన, శౌర్య అనసూయని తీసుకొని కార్తీక్ వస్తాడు. మీరందరు ఎందుకు వచ్చారని పారిజాతం అడుగుతుంది.
మగ పెళ్లి వాళ్ళం కదా అందుకే వచ్చామని శ్రీధర్ అంటాడు. ఇప్పుడు అందరిని మా ఆయన చూస్తే కోప్పడుతాడని పారిజాతం అనగానే నువ్వే అందరిని పిలిచావని చెప్తాని కార్తీక్ అంటాడు. దాంతో పారిజాతం బయపడి పక్కకి దాక్కుంటుంది. అప్పుడే శివన్నారాయణ వస్తాడు. నేను ఇల్లంతా సందడిగా ఉంటుందని ఒక్కరోజు ముందు రమ్మని చెప్పానని శివన్నారాయణ అనగానే.. అమ్మ కార్తీక్ గా నన్నే బయపెడుతావా అని పారిజాతం అనుకుంటుంది. వాళ్ళని పిలుస్తున్న విషయం నాకు ముందు ఎందుకు చెప్పలేదని దశరథ్ తో కోపంగా అంటుంది సుమిత్ర.
ఆ తర్వాత కావేరికి కార్తీక్ ఫోన్ చేసి.. చిన్నమ్మ మీరు రాలేదని అడుగుతాడు. అక్కడికి నేను రాకపోవడమే బెస్ట్.. వచ్చినవాళ్ళ ముందు అక్క పరువుపోతుందని కావేరి అంటుంది. మీ ఇష్టమని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత అందరు సరదాగా మాట్లాడుకుంటుంటే పారిజాతం ఓర్వలేక గొడవ చెయ్యాలని ట్రై చేస్తుంది. అప్పుడే శివన్నారాయణ వచ్చి పారిజాతం రూమ్ లో బట్టలు ఉన్నాయ్ తీసుకొని రా అని పంపిస్తాడు. పారిజాతం బట్టలు తీసుకొని వస్తుంది. ఆ తర్వాత కుంకుమ తీసుకొని రా అని మళ్ళీ పంపిస్తాడు. పారిజాతం వెళ్తుంది. నా చేతులు మీదుగా ఈ ఇంటి ఆడపడుచుకి బట్టలు పెట్టాలని అనుకుంటున్నానని శివన్నారాయణ అనగానే కాంచన హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.