English | Telugu

Illu illalu pillalu : మిల్ లో దొంగతనం చేసింది సింహాద్రి.. నర్మద తెలివి సూపర్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -243 లో.. భాగ్యం వాళ్ళ గురించి నర్మద, ప్రేమ రామరాజుకి చెప్పబోతుంటే అప్పుడే మిల్ లో దొంగలు పడి డబ్బు పోయిందని ఫోన్ చేసి చెప్పడంతో రామరాజుతో సహా అందరు మిల్ కి వెళ్తారు. అసలు ఏమైందని సింహాద్రిని అడుగుతాడు రామరాజు. ఏమో అయ్యా లాకర్ పగులగొట్టి డబ్బు తీసుకొని వెళ్ళారని సింహాద్రి చెప్తాడు.

అక్కడున్న వాళ్లందరిని సింహాద్రి ఎవరు డబ్బులు తీశారంటూ అడుగుతాడు. అక్కడ ఒక బియ్యం బస్తాపై రక్తం ఉంటుంది. అది నర్మద చూస్తుంది. మళ్ళీ సింహాద్రి చేతికి రక్తం ఉంటుంది. ఈ దొంగతనం చేసింది సింహాద్రి అని నర్మద చెప్తుంది. నేను చెయ్యలేదని సింహాద్రి అంటాడు. మరి ఎందుకు కంగారుపడుతున్నావ్ లాకర్ నుండి డబ్బు తీసుకొని ఆ బియ్యం బస్తాలో దాచావ్.. నీ చేతికి రక్తం ఉంది.. అలాగే అక్కడ సంచికి ఉంది.. ఆ సంచిలో డబ్బు ఉంటుంది చూడండి అని నర్మద అనగానే ధీరజ్, సాగర్, చందు వెళ్లి చూడగానే అందులో డబ్బు ఉంటుంది. దాంతో రామరాజు సింహాద్రిని తిడతాడు. నిన్ను ఎంత నమ్మానని కుప్పకూలిపోతాడు. వాడే దొంగతనం చేసాడని చెప్పకుండా ఉంటే బాగుండేది నర్మద.. ఏ దొంగ ఎత్తుకొని వెళ్ళాడనుకునే వాడిని.. నమ్మకం పోగొట్టుకున్నాడని రామరాజు ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత నేను గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవుతూ.. నాన్నని మోసం చేస్తున్నానని సాగర్... నేను ప్రేమని ఏ పరిస్థితిలో పెళ్లి చేసుకున్నానో తెలిస్తే నాన్న ఎలా రియాక్ట్ అవుతాడో.. ఇన్ని రోజులు చెప్పకుండా మోసం చేసానని ధీరజ్ ఇద్దరు అనుకుంటారు. నాన్నకి తెలియకుండా అప్పు చేసాను ఆ విషయం నాన్నకి తెలిస్తే మోసం చేసానని అనుకుంటాడంటూ చందు బాధపడతాడు.

మరొక వైపు శ్రీవల్లి తన అమ్మ దగ్గరికి వెళ్లి మన గురించి చెప్పేలోపు.. దొంగలు పడ్డారని మిల్ కి వెళ్ళారు కానీ వచ్చాక చెప్తారని శ్రీవల్లి భయపడుతుంది. తరువాయి భాగంలో నర్మద రామరాజు వాళ్లకు భాగ్యం వాళ్ళ గురించి చెప్పనందుకు నర్మదపై ప్రేమ కోపంగా ఉంటుంది. నువ్వు నాతో మాట్లాడకు అక్క అని ప్రేమ అనగానే నర్మద బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.